ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కరోనా మృతదేహాల దహన సంస్కారాలపై జీహెచ్‌ఎంసీ నూతన కార్యాచరణ ప్రారంభించింది. అందులో భాగంగా జీహెచ్‌ఎంసీలో మొబైల్ శ్మశాన వాటికలను ఏర్పాటు చేశారు. వీల్ ఆన్ క్రిమేషన్‌పై అధికారులు దృష్టిపెట్టారు. రూ.7.5 లక్షలతో కార్పొరేషన్ బాక్సులను కొనుగోలు చేసింది. వీటితో జీహెచ్‌ఎంసీ మొదటి దశ ట్రయల్స్‌ను కూడా పూర్తి చేసింది. ఇకపై కరోనా మృతదేహాలకు మొబైల్ ఎలక్ట్రికల్ క్రిమేషన్స్ బాక్సులతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
చక్రాలపై ఎలక్ట్రికల్ శ్మశాన వాటికను ఎక్కడికైనా తరలించే సౌకర్యం ఉంది. ఎర్రగడ్డలోని శ్మశానవాటికలో ప్రయోగాత్మకంగా మొబైల్ క్రియేషన్స్ బాక్సులను ఏర్పాటు చేశారు. ప్లగ్- ఇన్ మోడల్‌గా ఎక్కడికైనా క్రిమేషన్ బాక్స్‌లను రవాణా చేయవచ్చు. 1,200 డిగ్రీల ఫారెన్‌హీట్‌తో రెండు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. (బాబోయ్! అంబులెన్స్.. విమానం మోత!)
Comments
Please login to add a commentAdd a comment