
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశానవాటికలో దారుణం చోటు చేసుకుంది. నలుగురు ఓ శిశువు బతికి ఉండగానే ఖననం చేయడానికి యత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువును బతికుండగానే ఖననం చేయడానికి ప్రయత్నించారు. కవర్‌లో ఉంచిన శిశువును పాతి పెట్టాలని వారు శ్మశానవాటిక సిబ్బందిని కోరారు. దీంతో కవర్ తెరవగా శిశువు ఏడ్వటంతో శ్మశానవాటిక సిబ్బంది షాక్‌కు గురయ్యారు. సిబ్బంది ప్రశ్నించడంతో శిశువును వదిలి నలుగురు పరారయ్యారు. వెంటనే శ్మశానవాటిక సిబ్బంది కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్మశానవాటికకు చేరుకొని శిశువును రైల్వే న్యూకాలనీలోని ఆస్పత్రికి తరలించారు.