థాయ్లాండ్లో గుండెపోటుతో మరణించిన గుజరాత్ డీజీపీ అమితాబ్ పాఠక్ అంత్యక్రియలు పూర్తి పోలీసు లాంఛనాలతో ఆదివారం అహ్మదాబాద్లో జరిగాయి.
థాయ్లాండ్లో గుండెపోటుతో మరణించిన గుజరాత్ డీజీపీ అమితాబ్ పాఠక్ అంత్యక్రియలు పూర్తి పోలీసు లాంఛనాలతో ఆదివారం అహ్మదాబాద్లో జరిగాయి. సెలవు మీద కుటుంబంతో కలిసి ఆహ్లాద పర్యటన కోసం థాయ్లాండ్ వెళ్లిన పాఠక్ (58) అక్కడ ఉండగానే తీవ్రమైన గుండెపోటు రావడంతో శనివారం ఓ బీచ్ రిసార్టులో మరణించారు. ఆయన మృతదేహాన్ని గుజరాత్ తీసుకొచ్చారు.
అహ్మదాబాద్లో పాఠక్కు పూర్తి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఎలిస్ బ్రిడ్జి వద్ద గల వి.ఎస్. ఆస్పత్రి సమీపంలోని ఏఎంసీ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయని ఇన్చార్జి డీజీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు.
అంత్యక్రియలకు ముందు ఆయన మృతదేహాన్ని ఐపీఎస్ ఆఫీసర్ల మెస్లో సందర్శకుల కోసం ఉంచారు. 1977 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన అమితాబ్ పాఠక్కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన స్వస్థలం ఉత్తరప్రదేశ్. ఈ సంవత్సరం ఫిబ్రవరి 27న డీజీపీగా నియమితులైన పాఠక్.. 2015 ఫిబ్రవరిలో పదవీవిరమణ చేయాల్సి ఉంది.