ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బామ్మ శకుంతల గైక్వాడ్
ముంబై: కరోనాతో మృతి చెందిందని వృద్ధురాలికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలకు బంధువులను పిలిపించారు. కొద్దిసేపట్లో అంత్యక్రియలు మొదలు పెట్టనుండగా ఒక్కసారిగా ఆ పెద్ద మనిషి పాడెపై నుంచి ఏడుస్తూ కళ్లు తెరిచింది. దీంతో బంధువులంతా షాకయ్యారు. ఎలాగోలా తమ బామ్మ బతికిందని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బామ్మ ఆస్పత్రిలో ఉంది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
ముధాలేలోని బారామతి గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ (76)కు మే 10వ తేదీన కరోనా సోకిందని తేలింది. దీంతో కుటుంబసభ్యులు కారులో ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో ఆమెకు బెడ్ లభించలేదు. దీంతో కారులోనే చాలాసేపు వేచి ఉన్నారు. ఈ సమయంలో బామ్మ శకుంతల అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమెలో చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె మృతి చెందిందని భావించారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు.
ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. శకుంతల మృతదేహాన్ని పాడెపై ఉంచి బంధవులంతా ఏడుస్తుండగా అకస్మాత్తుగా శకుంతల ఏడుస్తూ కళ్లు తెరిచింది. ఒక్కసారిగా కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. బామ్మ చనిపోలేదు.. బతికే ఉందని భావించి ఒక్క క్షణం తర్వాత తేరుకుని ఆనందపడ్డారు. వెంటనే ఆమెను బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు.
చదవండి: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల
Comments
Please login to add a commentAdd a comment