సీనియర్ నేత శరద్ పవార్ వెల్లడి
పుణే: ఎన్‌సీపీ దిగ్గజ నేత శరద్ పవార్ త్వరలో రాజ కీయాల నుంచి వైదొల గనున్నారా? అంటే అవు ననే చెప్పుకోవాల్సి ఉంటుంది. మంగళవారం మహా రాష్ట్రలోని బారామ తిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన వెల్లడించిన విషయం దీనిని రూఢీ చేస్తోంది. భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, యువ తరానికి మార్గదర్శకంగా ఉంటానని శరద్ పవార్ అన్నారు. ‘ప్రస్తుతం అధికారంలో లేను. రాజ్యసభ సభ్యుడిగా మరో ఏడాదిన్నర కొనసాగుతాను. కానీ, ఆ తర్వాత మళ్లీ రాజ్యసభకు పోటీ చేయాలా వద్దా అనే విషయం ఆలోచించాలి. లోక్‌సభకే కాదు, ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను’అని అన్నారు.
‘బారామతి నుంచి 14 సార్లు పోటీ చేశా. ప్రతిసారీ మీరు నన్ను గెలిపించారు. ఒక్కసారి కూడా ఓడించలేదు. కానీ, నేనే దీనికి ముగింపు పలకాలి. కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి. ఆ తపనతోనే పనిచేస్తున్నా. అధికారం కాదు, ప్రజలకు సేవ చేయాలనేదే నా ఉద్దేశం. ప్రజల కోసం ఇకపైనా పనిచేస్తూనే ఉంటా’అని ఆయన ప్రకటించారు. ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న శరద్‌పవార్ వయస్సు 83 ఏళ్లు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు పనిచేశారు. 1967లో మొదటిసారిగా బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత 57 ఏళ్లలో ఒక్క ఓటమిని కూడా ఎరగని నేత శరద్‌పవార్.
Comments
Please login to add a commentAdd a comment