![Tamil Nadu Govt Declines Karunanidhi Cremation In Marina Beach - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/8/WhatsApp%20Image%202018-08-07%20at%2023.24.49.jpeg.webp?itok=BQ1SmwEz)
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలపై సందిగ్దం నెలకొంది. మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాది వెనుక భాగంలో కరుణానిధి అంత్యక్రియలు చేపట్టాలని కుటుంబ సభ్యులు భావించారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు చేపట్టడానికి అనుమతి నిరాకరించింది. గాంధీ మండపం రోడ్డులో అంత్యక్రియలకు ప్రభుత్వం అనుమతించింది. అక్కడ రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు తెలిపింది. దీనిపై డీఎంకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కరుణానిధి అంత్యక్రియలను ఎట్టి పరిస్థితుల్లోనూ మెరీనా బీచ్‌లోనే చేపడతామని డీఎంకే ప్రకటించింది. ఇందుకోసం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపింది. మెరీనాలో అనుమతి దొరికే వరకు కరుణ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచాలని డీఎంకే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ కలిగిన డీఎంకే కార్యకర్తలు సంయమనంతో మహానేతకు నివాళులు అర్పించాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment