హైదరాబాద్: ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీ దాశరథి రంగాచార్యుల పార్థీవదేహానికి మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని వెస్ట్ మారేడుపల్లి శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలలు, శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించిన గొప్ప వ్యక్తి దాశరథి రంగాచార్యులు.