
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో గంగానది ఉగ్రరూపం దాల్చింది. వరదల కారణంగా గంగానది జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఘాట్‌లకు సమీపంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాశీలోని మొత్తం 84 ఘాట్‌లు నీట మునిగాయి. ప్రస్తుతం హరిశ్చంద్ర ఘాట్ వీధుల్లో దహన సంస్కారాలు జరుగుతున్నాయి.
గత 10 రోజులుగా వారణాసిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వీధుల్లో దహన సంస్కారాలు చేయడం వల్ల కర్మకాండలు చేసేవారు సరైన సంప్రదాయాలను పాటించలేకపోతున్నారు. అక్కడ స్థలం తక్కువగా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. సాయంత్రం పూట దహన సంస్కారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మణికర్ణిక ఘాట్‌లో దహన సంస్కారాల కోసం జనం చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోంది.