నల్లగొండ : నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం రసూల్ గూడలో కానిస్టేబుల్ నాగరాజు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. సూర్యాపేట కాల్పుల దుండగుల ఎన్కౌంటర్ నేపథ్యంలో వారితో శనివారం పోరాడి ప్రాణాలొదిలిన నాగరాజుకు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు జరగనున్నాయి. దుండగుల తూటాలకు మృత్యు ఒడికి చేరిన కానిస్టేబుల్ నాగరాజు అంత్యక్రియలకు రాష్ట్రమంత్రులు హరీష్ రావు, జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి హాజరుకానున్నారు.