![Comedian Venu Madhav Cremation Completed - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/26/VENU.jpg.webp?itok=fBSx1MY0)
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలి హౌజింగ్ బోర్డ్ లక్ష్మీనగర్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు. వేణుమాధవ్ పెద్ద కుమారుడు చితికి నిప్పంటించాడు. ఫిలిం చాంబర్ నుంచి ప్రారంభమైన అంతియ యాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు వేణుమాధవ్‌కు కడసారి నివాళులర్పించారు.
(చదవండి : నవ్వు చిన్నబోయింది)
టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన వేణుమాధవ్ 400లకు పైగా సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించారు. కొంత కాలంగా సినీరంగానికి దూరంగా ఉంటున్న ఆయన, కాలేయ సంబంధిత వ్యాదితో బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment