![Mega Star Chiranjeevi Condolences To Venu Madhav - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/26/Chiranjeevi.jpg.webp?itok=-i0B6R2U)
బుధవారం మరణించిన హాస్యనటుడు వేణు మాధవ్ అంత్యక్రియలు కాప్రాలో నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌లో ఉంచారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఫిలిం చాంబర్ నుంచి ప్రారంభమైన అంతియ యాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేణు మాధవ్ పెద్ద కుమారుడు ప్రభాకర్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన వేణు మాధవ్ 400లకు పైగా సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించారు. కొంత కాలంగా సినీరంగానికి దూరంగా ఉంటున్న ఆయన, కాలేయ సంబంధిత వ్యాదితో బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment