ప్రిన్స్ అంత్యక్రియలు ఎందుకు సీక్రెట్గా చేశారు? | Prince's final journey: Photo shows rock star's ashes carried to waiting car after secret cremation | Sakshi
Sakshi News home page

ప్రిన్స్ అంత్యక్రియలు ఎందుకు సీక్రెట్గా చేశారు?

Published Sun, Apr 24 2016 10:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

ప్రిన్స్ అంత్యక్రియలు ఎందుకు సీక్రెట్గా చేశారు?

ప్రిన్స్ అంత్యక్రియలు ఎందుకు సీక్రెట్గా చేశారు?

న్యూయార్క్: అతడు హాలీవుడ్ గానాలోకానికి బాద్ షా లాంటివాడు. అతడు పాడేందుకు వేధికపైకి వస్తున్నాడని తెలియగానే ఇళ్లలో ఉన్నవారంతా టీవీలకు అతుక్కుపోతారు. తమ ముందే పాడుతున్నట్లుగా మైమరిచిపోతారు. మైఖెల్ జాక్సన్ అంతటి పేరున్న ఆ ఐకాన్ పర్సనాలిటి ప్రిన్స్. అవును ప్రిన్స్ రోజర్స్ నెల్సన్ గొప్ప పాప్ సింగర్.. బరాక్ ఒబామా దంపతులు సైతం ఆయనకు వీర అభిమానులు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఆయన ఎంతోమంది అభిమానులను సంపాధించుకున్నాడు.

అనూహ్యంగా ఈ గురువారం ఆయన కన్నుమూశారు. అయితే, లక్షలమంది అభిమానులు సొంతం చేసుకున్న ఆయనకు వరుసగా నేటి వరకు అశ్రునివాళులు అర్పిస్తున్నప్పటికీ అతడి కుటుంబ సభ్యులు మాత్రం అంత్యక్రియలు శరవేగంగా రహస్యంగా కానిచ్చేశారు. మిన్నే పొలిస్ లోని ఫస్ట్ మెమోరియల్ వెస్ట్రన్ చాపెల్ వద్ద కేవలం నాలుగు గంటల్లో అంత్యక్రియలు ముగించి వెంటనే ఆయన చితాభస్మాన్ని తీసుకొని తుది క్రతువుకు వెళ్లిపోయారు. ఈ విషయంపై వివరణ కోరగా తాను ఒక వేళ చనిపోతే ఎలాంటి హాడావుడి లేకుండా,ఇబ్బందుల్లో పడకుండా, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా తన అంత్యక్రియలు పూర్తి చేయాలని వారికి విజ్ఞప్తి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement