ఖరీదైన సమాధులు | costly tombs in philippines | Sakshi
Sakshi News home page

ఖరీదైన సమాధులు

Published Mon, Apr 18 2016 4:06 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

ఖరీదైన సమాధులు

ఖరీదైన సమాధులు

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉన్న స్థానిక చైనీయుల సమాధుల మధ్యనుంచి నడుస్తుంటే.. విలాసవంతమైన కాలనీ మధ్యనుంచి వెళ్తున్నట్లే అనిపిస్తుంది. రెండు వీధుల్లో విస్తరించి ఉన్న ఈ సమాధుల్లో కొన్ని రెండుమూడంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. చెప్పుకోవడానికి అవి సమాధులే కాని వాటిలో ఏసీ, టాయిలెట్, ఆధునిక వంటగది వంటి సమస్త సదుపాయాలన్నీ ఉంటాయి. మరణించిన వారి బంధువులు వారాంతాల్లో ఈ సమాధులను సంద ర్శించి తమ పూర్వీకులకు ఆహారం, సుగంధ ద్రవ్యాలను సమర్పిస్తుంటారు.

మిలియనీర్స్ రో, లిటిల్ బ్రేవర్లీ హిల్స్ అనే రెండు వీధులున్న ఈ శ్మశానవాటికను 19వ శతాబ్దం చివరి భాగంలో ఏర్పాటు చేశారు. స్థానిక కేథలిక్కులు తమ శ్మశానాల్లో చైనీయులను ఖననం చేయనివ్వకపోవడంతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో మనీలాకు వలసవచ్చిన చైనీయులు వ్యాపారంలో రాణించి సంపన్న వర్గంగా రూపాంతరం చెందారు. తమ స్థాయికి గుర్తుగా ఈ ఖరీదైన సమాధుల్ని నిర్మించారు.      - మనీలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement