సాక్షి,ముంబయి:అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు ఛోటా షకీల్‌పై నమోదైన కేసుల వివరాలను థానే పోలీసులకు ముంబయి పోలీసులు చేరవేశారని అధికారులు చెప్పారు. దావూద్ చిన్న సోదరుడు ఇక్బాల్ కస్కర్ అరెస్ట్ అయిన థానే కేసులో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టాన్ని ప్రయోగించవచ్చా అనే అంశంలో థానే పోలీసులు ముంబయి పోలీసు వర్గాలను ఈ సమాచారం కోరారు.
థానే పోలీసులు కోరిన సమాచారం అంతటినీ వారికి అందచేశామని ముంబయి అధికారులు తెలిపారు. దావూద్ ఇబ్రహీం, ఆయన సోదరులు అనీస్, ఇక్బాల్,చోటా షకీల్‌పై నమోదైన దోపిడీ కేసుల్లో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం వర్తింపచేయవచ్చా అనే దానిపై లోతైన పరిశీలన అవసరమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. థానే కేసులో దీన్ని వర్తింపచేయాలంటే చోటా షకీల్‌పై గతంలో నమోదైన కేసులను ప్రాతిపదికగా చూపాల్సి ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment