Gangrene
-
కరోనా బాధితులకు గ్యాంగ్రీన్ ముప్పు!
అహ్మదాబాద్: ప్రాణాంతక కరోనాను జయించామనే ఆనందం లేకుండా చేస్తున్నాయి బ్లాక్‌ఫంగస్, వైట్‌ఫంగస్ వ్యాధులు. ఫంగస్ వ్యాధులతోనే సతమతం అవుతుంటే ఇప్పుడు వీటికి గ్యాంగ్రీన్ జతవుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో గ్యాంగ్రీన్ లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు వైద్యులు. పోస్ట్ కోవిడ్ తర్వాత శరీరంలో వచ్చే మార్పులను జాగ్రత్తగా గమనించాలని లేదంటే గ్యాంగ్రీన్, గుండెపోటు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్యాంగ్రీన్ కోవిడ్ బారిన పడిన వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. దీంతో రకరకాల అనారోగ్య సమస్యలు వారిన్ని వెన్నాడుతున్నాయి. ఇందులో చాలా మందిలో రక్తం చిక్కబడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు గుర్తించారు. అయితే చిక్కబడుతున్న రక్తాన్ని శరీరం తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. అయితే ఈ ప్రక్రియ పదేపదే జరగడం వల్ల కొందరిలో రక్తం గడ్డ కట్టుకుపోయి త్రోంబోసిస్‌కి దారి తీస్తోందంటున్నారు డాక్టర్లు. అయితే ఈ రక్తపు గడ్డలు శరీరంలో ఎక్కడైతే రక్త ప్రసరణకు అతిగా అడ్డుపడతాయో క్రమంగా ఆ భాగంలో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా కాళ్లు, చేతుల్లో రక్తపు గడ్డలు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా గ్యాంగ్రీన్‌కు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా కేసులు గుజరాత్లో వెలుగు చూస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం వద్దు కాళ్లు , చేతుల్లో రక్తపు గడ్డలు ఏర్పడి మొద్దుబారిపోయి బరువుగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వైద్య చికిత్స చేయించుకోవాలంటున్నారు. లేదంటే కొద్ది రోజుల్లోనే ఆ గడ్డలు ఎరుపు లేదా నీలం రంగులోకి మారిపోతాయని చెబుతున్నారు. ఇక రక్తపు గడ్డలు గుండె లేదా మెదడులో ఏర్పడి రక్త ప్రసరణకు అడ్డుపడితే ఆరు గంటల్లోగా వైద్య సాయం అందించాల్సి ఉంటుందని లేదంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్యులు. -
దావూద్ చనిపోతే.. వారసుడెవడు?
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ప్రాణ గండం సమీపించిందనే కథనాల నేపథ్యంలో దావూద్ వారసుడు ఎవరన్నది కీలకంగా మారింది. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, ఆయనకు సోకిన గ్యాంగ్రీన్ చివరిదశలో ఉందని వైద్యులు తేల్చి చెప్పినట్లు తాజాగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనాలు నిజం కావని, దావూద్ బలంగానే ఉన్నాడని అతని రైట్ హ్యాండ్ ఛోటా షకిల్ చెప్తున్నప్పటికీ.. దావూద్ చనిపోతే అతని స్థానంలో మాఫియా నేరప్రపంచం పగ్గాలు ఎవరు చేపడతారు? ముంబై మాఫియాను ఎవరు నడిపిస్తారన్నది? చర్చనీయాంశంగా మారింది. ముంబై అండర్ వరల్డ్ కేసులు ఎన్నింటినో దర్యాప్తు చేసిన మాజీ పోలీసు అధికారి ఒకరు స్పందించారు. దావూద్ చనిపోతే.. అతని వీరవిధేయుడైన ఛోటా షకీల్ వారసుడిగా పగ్గాలు చేపట్టే అవకాశముందని వెల్లడించారు. 'దావూద్ స్థానంలో ఛోటా షకీలే పగ్గాలు చేపట్టే అవకాశముంది. షకీల్‌కు దూకుడు ఎక్కువ' అని ముంబై మాజీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ షంషేర్ ఖాన్ పఠాన్ తెలిపారు. అయితే, దావూద్ విషమపరిస్థితిలో ఉన్నాడని, రేపోమాపో అన్నట్టుగా అతని పరిస్థితి ఉందన్న కథనాలపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. మరోవైపు దావూద్ ఇబ్రహీం చాలా బలంగా ఉన్నాడని ఆయన కీలక అనుచరుడు చోటా షకీల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రాణ గండం సమీపించిందని మీడియాలో వచ్చిన కథనాలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే అని అతను ఓ మీడియాకు తెలిపాడు. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దానిని మీడియా అనవసరంగా ప్రచారం చేస్తోందని, దావూద్‌కు ఎలాంటి ప్రాణముప్పు లేదని చెప్పుకొచ్చాడు. ఏదీఏమైనా -
'మా డాన్ చాలా ఫిట్‌గా ఉన్నారు'
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా బలంగా ఉన్నారని ఆయన కీలక అనుచరుడు, సన్నిహితుడు చోటా షకీల్ చెప్పాడు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రాణ గండం సమీపించిందని మీడియాలో వచ్చిన కథనాలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే అని ఓ మీడియాకు తెలిపాడు. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దానిని మీడియా అనవసరంగా ప్రచారం చేస్తోందని, దావూద్‌కు ఎలాంటి ప్రాణముప్పు లేదని చెప్పాడు. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరిదశలో ఉన్నట్లు తేల్చి చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో అతనికి సైనిక ఆస్పత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారని, సీఎన్ఎన్-న్యూస్ 18 తాజా కథనం ప్రకారం గ్యాంగ్రీన్ చివరి దశలో ఉందని, దావూద్ మరణించే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు కథనాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే దావూద్ ఆరోగ్యంపై చోటా షకీల్ స్పందించాడు. 'మా గ్యాంగ్ స్టర్ దావూద్ చాలా ఫిట్ గా ఉన్నారు. వ్యక్తిగత లాభంతో ఎవరో సృష్టించిన గందరగోళంతో ఈ వదంతులు వ్యాపిస్తున్నాయి. మీ వార్తా సంస్థల వద్ద ఉంది తప్పుడు సమాచారం. దావూద్ ఫిట్ గా ఉన్నారు' అని అతడు చెప్పాడు. -
దావూద్ పరిస్థితి విషమం!
కరాచీ: మాఫియా డాన్, ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం చావుబతుకుల్లో ఉన్నాడా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స చేస్తున్న వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరిదశలో ఉన్నట్లు తేల్చి చెప్పేశారట.కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో అతనికి సైనిక ఆస్పత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారు. సీఎన్ఎన్-న్యూస్ 18 తాజా కథనం ప్రకారం గ్యాంగ్రీన్ చివరి దశలో ఉందని, దావూద్ మరణించే అవకాశముందని వైద్యులు చెప్పారు. అధిక రక్తపోటు, మధుమేహం వల్ల దావూద్ కాళ్లలోని రక్తసరఫరాలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయని, కాళ్లకు ఆక్సిజన్ అందక కణజాలం కుళ్లిపోతోందని తేల్చారు. గ్యాంగ్రీన్ వల్ల ఉత్పత్తయ్యే విషపదార్థాలు శరీరమంతా కూడా వ్యాపించే అవకాశముందంటున్నారు. కాళ్లు తీసేయడం తప్ప ప్రస్తుతం వేరే ప్రత్యామ్నాయం లేదని వైద్యులు భావిస్తున్నారట. ఐఎస్ఐ రక్షణ కింద ఉన్న దావూద్‌ను కరాచీ నుంచి తరలించే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ దావూద్ పాక్‌లో చనిపోతే అతన్ని రప్పించేందుకు భారత్ చేస్తున్న కృషి వృథా అయినట్లే.