
వర్మ ఇంకో బుల్లెట్ వదిలాడు..
హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకో పుస్తకం రాస్తున్నాడట. కేవలం తన కామెంట్స్, సినిమాలతోనే కాకుండా ట్విట్స్తో కూడా సంచలనాలు క్రియేట్ చేసే వర్మ మరో బుక్ రిలీజ్ కు రెడీ అవుతున్నాడట. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా ట్విట్ చేశాడు. 'బుల్లెట్స్ అండ్ బూబ్స్' పేరుతో ఒక పుస్తక రచనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపాడు. ముంబై కి చెందిన మాఫియా డాన్ జీవితానికి సంబంధించి అంశాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నాడు.
ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తాను కలిసినపుడు తనకెదురైన అనుభవాలు, డాన్ తనతో పంచుకున్న అభిప్రాయాలు ఇందులో వుంటాయని వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇతర గ్యాంగ్ స్టర్లతో పోలిస్తే దావూద్ చాలా మిస్టీరియస్ గా ఎవరికీ అంతు చిక్కకుండా వుండడం తనకు నచ్చుతుందన్నాడు. ఈ 20 ఏళ్లలో అతనికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఇంతకాలంగా అండర్ వరల్డ్ మాఫియా సామ్రాజ్యాన్ని అతను ఎలా ఏలాడు ..తదితర అంశాలు ఇందులో ఉంటాయంటూ అభిమానులను ఊరిస్తున్నాడు.
కాగా ఇప్పటికే కే 'నాఇష్టం', 'గన్స్ అండ్ థైస్' పేరుతో పుస్తకాలను విడుదల చేసిన వర్మ అనేక విమర్శల పాలయ్యాడు. మరి తనదైన శైలిలో చెలరేగి టైటిల్ పెట్టిన తాజా పుస్తకంపై ఎలాంటి విమర్శలు, వివాదాలు రగలనున్నాయో వేచి చూడాల్సిందే.
My "Bullets and Boobs" book will have a chapter on my experience on when I met the greatest Gangster ever
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2016