చీకటి సామ్రాజ్యాధినేత దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్థాన్ మరోసారి చెప్పింది. దావూద్ పాక్లోనే ఉన్నట్లుగా భారతదేశ వర్గాలు మరోసారి శుక్రవారం నాడు ప్రకటించిన నేపథ్యంలో పాక్ స్పందించింది.
చీకటి సామ్రాజ్యాధినేత దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్థాన్ మరోసారి చెప్పింది. దావూద్ పాక్లోనే ఉన్నట్లుగా భారతదేశ వర్గాలు మరోసారి శుక్రవారం నాడు ప్రకటించిన నేపథ్యంలో పాక్ స్పందించింది. దావూద్ ఇక్కడ లేడన్న విషయాన్ని భారత అధికారులకు కూడా తెలియజేసినట్లు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తస్నీం అస్లాం తెలిపారు. పోనీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా దావూద్ అక్కడున్నాడా అని అడగ్గా, గతంలోనూ అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు. తాము పక్కాగా వెతికినా ఇక్కడేమీ కనపడలేదన్నారు.
గతంలో ఒసామా బిన్ లాడెన్ విషయంలో కూడా పాక్ ఇలాగే వ్యవహరించింది. అతడెక్కడున్నాడో తమకు తెలియదని పదే పదే బుకాయించింది. చివరకు అమెరికా నేవీ సీల్స్ అసలు అనుమతి కూడా తీసుకోకుండా నేరుగా ఆకాశమార్గంలో వచ్చి, లాడెన్ను పాక్ నడిబొడ్డున అబోతాబాద్లో మట్టుబెట్టారు. అప్పటికి గానీ అసలు లాడెన్ అక్కడున్న విషయమే తమకు తెలియదని పాక్ బొంకింది. ఇప్పుడు కూడా అలాగే చేస్తోందన్నది భారత వర్గాల ఆరోపణ.