పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి అతని మేనల్లుడు అలీషా పార్కర్ సంచలన విషయాలు వెల్లడించాడు. దావూద్ పాక్ మహిళ పఠాన్‌ను రెండో పెళ్లి చేసకున్నాడంటూ బాంబు పేల్చాడు. అలాగే అతను పాకిస్తాన్‌లోని కరాచిలోనే ఉన్నాడని కాకపోతే వేరే ప్రదేశంలోకి మకాం మార్చాడని కీలక విషయాలు చెప్పాడు. ఈ మేరకు ఉగ్రవాద నిధుల కేసుకి సంబంధించి నేషనల్ ఇన్విస్ట్‌గేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) చేసిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ ఈ విషయాలను బయటపెట్టాడు.
ఈ అలీషా పార్కర్ దావూద్ ఇబ్రహీం సోదరి, చనిపోయిన హసీనా పార్కర్ కుమారుడు అలిషా ఇబ్రహీం పార్కర్. ఇప్పటికే ఎన్‌ఐఏ దర్యాప్తు సంస్థ దావూద్ ఇబ్రహీం, అతని సన్నిహితులపై కేసు నమోదు చేసి కొందర్ని అరెస్టు చేసింది కూడా. అదీగాక దావూద్ దేశంలో బడా నేతలు, వ్యాపారులపై దాడి చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది. వారు తమ అరాచకాలను పెద్దపెద్ద నగరాల్లో వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సాగిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ నుంచి ఎన్‌ఐఏ ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
ఈ మేరకు అలీషా పార్కర్ విచారణలో ...దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని, అలాగే అతడి భార్య తన వాళ్లతో టచ్‌లోనే ఉందని చెప్పాడు. అలాగే అతను ఈ కేసులో పట్టుబడకుండా ఉండేందుకే పాకిస్తాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె పేరు పఠాన్ అని చెప్పుకొచ్చాడు.ఇప్పడూ దావూద్ కరాచీలోని అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక ఉన్న రహీమ్ ఫకీ సమీపంలోని డిఫెన్స్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపాడు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను తాను కొన్ని నెలల క్రితం జులై 2022లో దుబాయ్‌లో కలిశానని చెబుతున్నాడు. అలాగే ఆమె పండుగలకు తన భార్యకు ఫోన్ చేస్తుంటుందని, వాట్సాప్ కాల్స్ ద్వారా తన భార్యతో మాట్లాడుతుందని కూడా చెప్పాడు.
ప్రస్తుతం దావూద్, అతని సన్నిహితులు అనీస్ ఇబ్రహీం షేక్, ముంతాజ్ రహీమ్ ఫకీ తదితరులు తమ కుటుంబాలతో సహా పాకిస్తాన్‌లోని కరాచీలో డిఫెన్స్ కాలనీలో అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక నివశిస్తున్నారని పేర్కొన్నాడు. అతను ఇప్పుడూ ఎవరితోనూ టచ్‌లో లేడని చెబుతున్నాడు. అలాగే దావూద్ తన మొదటి భార్యకు విడాకులిచ్చాడనేది అవాస్తవం అని చెప్పాడు. దావూద్‌కి మొదటి భార్య మైజాబిన్‌తో ముగ్గురు కూమార్తెలు, ఒక కూమారుడు ఉన్నారని తెలిపాడు. అంతేగాదు అలీషా పార్కర్ విచారణలో దావూద్ నలుగురు సోదరులకు సంబంధంచిన విషయాలు కూడా దర్యాప్తు సంస్థకు వెల్లడించినట్లు సమాచారం.
(చదవండి: దావూద్‌పై ఎన్‌ఐఏ రూ.25 లక్షల బౌంటీ.. అండర్ వరల్డ్ డాన్‌పై ఎన్ని కేసులన్నాయంటే..)
Comments
Please login to add a commentAdd a comment