
నరేంద్ర మోదీ దమ్మున్న నేతే అయితే...
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ దమ్మున్న నేతే అయితే అండర్ వరల్డ్ డాన్ దావూద్ను శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీహెచ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ప్రధానితో చర్చించడం కాదు... పాకిస్థాన్లో ఆశ్రయం పొందుతున్న అండర్ వరల్డ్ డాన్ను భారత్కు రప్పించాలని మోదీకి సవాల్ విసిరారు.
ఆదివారం హైదరాబాద్లో వీహెచ్ విలేకర్లతో మాట్లాడుతూ.... నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజలందరికి పంచుతానని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీకి వీహెచ్ సూచించారు.