సాక్షి,విజయవాడ : సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాణహాని తలపెట్టేలా కూటమి పార్టీల చర్యలున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారం బయటికి పొక్కి సోషల్‌మీడియా కార్యకర్తల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని జనసేన సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేస్తోంది.
కేవలం పోలీసులు వద్ద ఉండాల్సిన సమాచారాన్ని సోషల్‌మీడియాలో పెట్టి బహిరంగపరుస్తున్నారు.తాజాగా సోషల్‌మీడియా యాక్టివిస్టు అనిల్ నాయక్ లొకేషన్‌ను జనసేన కార్యకర్తలు సోషల్‌మీడియాలో పోస్టుచేశారు. లొకేషన్‌ను అక్షాంశాలు,రేఖంశాలతో సహా పోస్ట్ చేశారు.ఈ పోస్టులతో తనకు ప్రాణహాని కలిగేలా చేస్తున్నారని అనిల్‌నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులు చట్ట వ్యతిరేకమని ఆయన ఆరోపించారు.
Shocking breach! Sensitive data, meant only for police access, is now public. If this isn’t dealt with seriously, privacy in AP is doomed, paving the way for dangerous misuse. If a third party is involved, they need to be held accountable . pic.twitter.com/sbeUfL01hp
— bagira (@bigcatt09) December 2, 2024
Comments
Please login to add a commentAdd a comment