యోగిని, నన్ను చంపేస్తారట: రాజాసింగ్‌ | MLA Raja Singh About His Life Threat Calls, Complains To DGP - Sakshi
Sakshi News home page

యోగిని, నన్ను చంపేస్తారట: బెదిరింపు కాల్స్‌పై రాజాసింగ్‌

Published Wed, Oct 25 2023 7:58 PM | Last Updated on Wed, Oct 25 2023 8:39 PM

MLA Raja Singh About His Life Threat Calls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోషామహల్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. చంపేస్తానంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెబుతున్నారాయన. 

ఫోన్‌లో చంపుతాం.. నరుకుతాం అని కొందరు భయపెడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాగే కాల్స్‌ వచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ త్వరలో నా నియోజకవర్గానికి వస్తున్నారు. మా ఇద్దరినీ కలిపి చంపుతామని ఇప్పుడు భయపెడుతున్నారని రాజాసింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని అంటున్నారాయ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement