హీరోయిన్ ను బెదిరించి దొరికిపోయాడు | Mahesh Bhatt-Alia Bhatt threat calls: Unemployed 24-year-old Lucknow man arrested | Sakshi
Sakshi News home page

హీరోయిన్ ను బెదిరించి దొరికిపోయాడు

Published Fri, Mar 3 2017 2:51 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

హీరోయిన్ ను బెదిరించి దొరికిపోయాడు

హీరోయిన్ ను బెదిరించి దొరికిపోయాడు

ముంబై: ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కుటుంబానికి బెదిరించిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సందీప్ సాహు.. లక్నోకు చెందిన నిరుద్యోగిగా గుర్తించారు. సందీప్ అండర్ వరల్డ్ డాన్ బాబ్లూ శ్రీవాస్తవ పేరుతో ఫోన్ చేసి మహేశ్ భట్ కుటుంబాన్ని బెదిరించాడు. తనకు 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మహేశ్ భట్ కూతురు, హీరోయిన్ ఆలియా భట్‌, భార్య సోనీ రజ్దాన్‌ను చంపేస్తా అంటూ ఫోన్ లో బెదిరించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సహాయంతో 12 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. బంధువుల నుంచి తీసుకున్న రూ. 6 లక్షల అప్పుతీర్చేందుకు అతడు బెదిరింపులకు దిగినట్టు పోలీసులు గుర్తించారు. వ్యాపారంలో నష్టం రావడంతో గతేడాది ముంబైకి వచ్చిన సందీప్ సినిమాల్లో నటించాలని ప్రయత్నించాడు. అవకాశాలు రాకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో అతడు బెదిరింపులకు దిగినట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement