హీరోయిన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు | mahesh bhatt family gets life threats | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

Published Thu, Mar 2 2017 9:30 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

హీరోయిన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

హీరోయిన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. మర్యాదగా 50 లక్షల రూపాయలు ఇచ్చారో సరే.. లేకపోతే మీ కూతురు ఆలియా భట్‌ను, భార్య సోనీ రజ్దాన్‌ను చంపేస్తా అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మహేష్ భట్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి, భట్ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఈ కేసును ముంబై పోలీసు శాఖలోని యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ (ఏఎన్‌సీ)కి బదిలీ చేశారు. తాను ఒక గ్యాంగ్ లీడర్‌ని అని చెప్పుకొని అతడు బెదిరించినట్లు చెబుతున్నారు. 
 
మొదట అదేదో ఉత్తుత్తి బెదిరింపు అని మహేష్ భట్ వదిలేశారు. అయితే, వరుసపెట్టి వాట్సప్‌, ఎస్ఎంఎస్‌ల ద్వారా సందేశాలు పంపుతూ, తన బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించాడు. తాను ఆలియా, సోనీలను చంపేస్తానని, వాళ్ల శరీరాల్లోకి పలు రౌండ్ల బుల్లెట్లు కాలుస్తానని అన్నాడు. మరికొన్ని మెసేజిలు కూడా పంపి, ఆ తర్వాత ఆపేశాడు. లక్నోకు చెందిన ఒక బ్యాంకు శాఖలో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని సూచించాడు. 
 
తన భార్య, కుమార్తెల ప్రాణాలకు ముప్పు ఉండటంతో మహేష్ భట్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా దీన్ని తీవ్రంగానే పరిగణించి, భట్ కుటుంబం నివసించే ప్రాంతంలో భద్రతను పెంచారు. ఇంతకుముందు కూడా దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు మొత్తం భట్ కుటుంబాన్ని చంపేయడానికి కుట్ర పన్నగా, వారిని 2014 నవంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement