నా భర్తకు తెలియకుండా అవకాశాల కోసం ప్రయత్నించా: అలియా భట్‌ తల్లి | Soni Wished to Work After Alias Birth Without Saying Her Husband | Sakshi
Sakshi News home page

నా భర్తకు తెలియకుండా అవకాశాల కోసం ప్రయత్నించా: అలియా భట్‌ తల్లి

Oct 24 2021 9:04 PM | Updated on Oct 24 2021 9:05 PM

Soni Wished to Work After Alias Birth Without Saying Her Husband - Sakshi

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అలియా భట్‌ తల్లిదండ్రులు మహేశ్‌ భట్‌, సోనీ రాజ్దాన్ నటులనే సంగతి తెలిసిందే. వారిద్దరూ 1986 ప్రేమ వివాహం చేసుకోగా..

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అలియా భట్‌ తల్లిదండ్రులు మహేశ్‌ భట్‌, సోనీ రాజ్దాన్ నటులనే సంగతి తెలిసిందే. వారిద్దరూ 1986 ప్రేమ వివాహం చేసుకోగా సంతానంగా 1988లో షాహీన్ భట్, 1993లో అలియా కలిగారు. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పెళ్లి తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వెల్లడించింది.

భర్తకు తెలియకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినట్లు ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వూలో సోనీ తెలిపింది. ఆ సమయంలో ఓ ప్రోడ్యూసర్‌ వద్దకి వెళ్లి పని కోసం అడగగా ‘మీకు పెళ్లైంది కదా?’ అడగారని, ఈ కారణంగా అవకాశం ఇవ్వకపోవడం బాధించిందని చెప్పింది. ఈ ప్రయత్నాలన్నీ తనకు రెండో సంతానంగా అలియా పుట్టిన తర్వాత చేసినట్లుగా చెప్పుకొచ్చింది. అయితే ఆమె రెండో ఇన్సింగ్స్‌లో భాగంగా సినిమాల్లో డిఫరెంట్‌ పాత్రలు, ఓటీటీలో షోలు చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ‘కాల్ మై ఏజెంట్‌’ నటిస్తూ బిజీగా ఉంది.

చదవండి: రణ్‌బీర్‌ అంటే అప్పటి నుంచే ఇష్టం: అలియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement