రెండేళ్లుగా ప్రేమ.. 9 రోజుల క్రితం పెళ్లి.. రక్షణ కల్పించండి | Young Lovers Complaints Police Life Threating From Families In Khammam | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా ప్రేమ.. 9 రోజుల క్రితం పెళ్లి.. రక్షణ కల్పించండి

Published Fri, Jul 16 2021 8:23 AM | Last Updated on Fri, Jul 16 2021 12:11 PM

Young Lovers Complaints Police Life Threating From Families In Khammam - Sakshi

కామేపల్లి: ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం కామేపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. పింజరమడుగు గ్రామానికి చెందిన కర్రి దేవా, తాళ్లగూడెంకు చెందిన బండారి కావ్యలు డిగ్రీ చదువుతున్నారు. వీరు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కావ్యకు తల్లిదండ్రులు వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తుండగా గత తొమ్మిది రోజుల కిందట ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుని..గురువారం కామేపల్లి ఠాణాకు వచ్చారు.

'మా కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉంది.. మమ్మల్ని కాపాడండి' అని ఫిర్యాదు చేశారు. కాగా  ఎస్సై జి.స్రవంతి ప్రేమజంటకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మేజర్లు కావడం, విడిపోడానికి ఇష్టపడకపోవడంతో కావ్యను  అబ్బాయి దేవా కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామపెద్దలు వీరిద్దరికీ తాళ్లగూడెం ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement