సినిమా చూస్తే.. సింపుల్‌గా ప్రాణాలు పోతాయి అక్కడ !
నచ్చిన బట్టలు, హెయిర్ స్టైల్ చేసుకున్నా.. తీసి జైళ్లో పడేస్తారు.
సరదాగా ఏదైనా పని చేస్తే.. బతుకంతా ఏ గనుల్లోనో, పల్లెటూరిలోనో వెట్టిచాకిరీకి అంకితం చేస్తారు.
చివరికి సంబురాలు, ఏడుపులపై కూడా నిషేధాజ్ఞాలు.
పాపం.. అక్కడి జనాలకు ఏం చేయాలన్నా ఆటంకాలే.
అక్కడి చట్టాలు.. అవి తయారు చేసే నియంతాధ్యక్షుడు అలాంటోడు!. ప్రపంచమే ఆయన్ని చూసి ముక్కున వేలేసుకుంటుంది మరి.
కిమ్ జోంగ్ ఉన్.. తమ దేశ అధ్యక్షుడి పేరు వింటే ఉత్తర కొరియా జనాలకు కంటి మీద కునుకు పట్టదు. ఏ పూట ప్రభుత్వం తరపునుంచి ఎలాంటి ప్రకటన వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. అదే టైంలో సిసలైన ఆ నియంత కొత్త కొత్త నిర్ణయాలనూ ప్రపంచమూ ఆసక్తిగా గమనిస్తుంటుంది. కిమ్‌కు కోపం తెప్పించే పని ఎవరూ చేసినా వాళ్ల పని ఖతం. అలాంటిది ‘ఒక్కడు’ దాయాదిగడ్డపై కిమ్‌ను ఎగతాళి చేస్తూ పదేళ్లుగా కాలరేగరేసి మరీ బతికేస్తున్నాడు.
కిమ్ మిన్ యోంగ్.. వయసు ముప్పై పదుల్లో ఉంటుంది! ఉండేది సియోల్(సౌత్ కొరియా) నగరంలో. బొద్దు రూపంతో నార్త్ కొరియా అధ్యక్షుడికి దూరం పోలికలే ఉంటాయనుకోండి. అయితే అనుకరణ మాత్రం అచ్చంగా ఉంటుంది. దీనికి తోడు కిమ్ హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్‌ను యాజ్ ఇట్ ఈజ్‌గా దించేస్తాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొరివితో తలగొరుకునే చేష్టలకు పాల్పడుతున్నాడతను.
కిమ్ పదేళ్ల క్రితం అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ టైంలో కిమ్ మిన్ అమెరికా యూనివర్సిటీలకు వెళ్లే స్టూడెంట్స్‌కి కౌన్సిలింగ్ ఇచ్చి బతికేవాడు కిమ్ మిన్. కానీ, కిమ్‌లా ఉన్నాడంటూ.. ఇమిటేట్ చేస్తున్నాడంటూ కొందరు కాంప్లిమెంట్ ఇవ్వంతో.. అప్పటి నుంచి నియంత నేతను అనుకరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు మొదలుపెట్టాడు. అవి అలాంటి ఇలాంటి వీడియోలు కావు. కిమ్ పరువు తీసిపడేసేలా ఉంటాయి అతను ఎంచుకునే కాన్సెప్ట్‌లు. మొదట్లో హ్యూమర్‌గా జనాలు వాటిని ఎంజాయ్ చేశారు. ‘డ్రాగన్ కిమ్’ అంటూ అతగాడికి బిరుదు కూడా ఇచ్చేశారు. అయితే రాను రాను అవి మరీ ఘోరంగా ఉంటున్నాయి. దీంతో ఇప్పుడు బెదిరింపులు మొదలయ్యాయట.
తాజాగా ఓ ఇంటర్నేషనల్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రాణ భయం గురించి చెప్పుకొచ్చాడు డ్రాగన్ కిమ్. ఆన్‌లైన్‌లో మిన్ యోంగ్‌కు బెదిరింపులు వస్తున్నాయట. if you mock our Dear Leader, you will be in trouble, like, big trouble!ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌లతో మిన్ యోంగ్ వస్తున్న సందేశాలు. అంతేకాదు అతని చావు ఊహించని రీతిలో ఉంటుందని బెదిరిస్తున్నారట. దీంతో ప్రాణభయంతో అతగాడు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు పోలీసులు నగరం విడిచి వెళ్లకుంటే రక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇతగాడి భద్రత అంశం హాట్ టాపిక్‌గా మారింది సౌత్ కొరియాలో.
కొసమెరుపు.. 2019లో వియత్నాం వేదికగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌లు భేటీ అయ్యారు. ఆ సమయంలో డ్రాగన్ కిమ్ కూడా అక్కడే ఉన్నాడు. అంతేకాదు వెకిలి వేషాలు వేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఆరు రోజులు జైల్లో పెట్టారు. కిమ్ మిన్ మాత్రమే కాదు.. కిమ్ జోంగ్ ఉన్, ట్రంప్ పోలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను సైతం వియత్నాం పోలీసులు అరెస్ట్ చేశారు.
చదవండి: నార్త్ కొరియా: లెదర్ జాకెట్లు బ్యాన్, కారణం తెలిస్తే తిట్టిపోస్తారు
Comments
Please login to add a commentAdd a comment