చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని: మత్తయ్య | I have life threat from chandra babu naidu, says mathaiah | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని: మత్తయ్య

Published Mon, Aug 22 2016 12:28 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని: మత్తయ్య - Sakshi

చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని: మత్తయ్య

ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకేం కాదు.. నేనున్నానంటూ చంద్రబాబు గతంలో జోల పాడారని, ఇప్పుడు తనను అగమ్య గోచర పరిస్థితిలోకి నెట్టారని మత్తయ్య అన్నారు. చంద్రబాబు అసలు కథేంటో ఈ కేసులో తేలిపోతుందని చెప్పారు.

తన కుటుంబానికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ తనతో ఆడుకుంటున్నారని వాపోయారు. తాను భయభ్రాంతులతో ఢిల్లీకి వచ్చానని.. తనకు ఏం జరిగినా కేసీఆర్, చంద్రబాబులదే బాధ్యత అని మత్తయ్య చెప్పారు. ఆయన సోమవారం తనకు ప్రాణహాని ఉందంటూ ఎన్హెచ్ఆర్సీ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement