ప్రాణహాని ఉంది.. తుపాకీ కావాలి : ధోని భార్య | MS Dhoni Wife Sakshi Dhoni Applies For Gun Licence | Sakshi
Sakshi News home page

ప్రాణహాని ఉంది.. తుపాకీ కావాలి : ధోని భార్య

Jun 20 2018 1:14 PM | Updated on Jun 20 2018 5:55 PM

MS Dhoni Wife Sakshi Dhoni Applies For Gun Licence

భారత్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని భార్య సాక్షి లైసెన్స్‌ రివ్వాలర్‌ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. అంతేకాక తనకు ప్రాణ హాని ఉందని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఎంఎస్‌ ధోని మ్యాచ్‌ల దృష్ట్యా బీజీగా ఉంటారనే విషయం విదితమే. ‘ధోని ఇంట్లో చాలా తక్కువ సమయం ఉంటారు. నేను నా కూతురితో కలిసి ఒంటరిగానే ఇంట్లో ఉంటాను. తరచూ ఏదో ఒక పని మీద బయట తిరుగుతుంటాను. ఆ సమయంలో ఒంటరిగానే వెళ్తాను. నా భద్రతా దృష్ట్యా త్వరగా లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ లేదా 0.32 రివాల్వర్‌ ఇప్పించండి’  అని సాక్షి పేర్కొన్నారు.

గతంలో కూడా ఎంఎస్‌ ధోని కూడా లైఎస్స్‌ తుపాకీ కోసం అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ధోనికి 9ఎమ్‌ఎమ్‌ గన్‌కు కూడా అనుమతి ఇచ్చారు. టీమిండియా జట్టు త్వరలో ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. యో యో టెస్టు పాసైన ఎంఎస్‌ ధోని ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ సెషన్స్‌లో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement