permition
-
ఎగిరే కారుకు అమెరికా అనుమతి
కాలిఫోర్నియా: తాము తయారు చేసిన ఎగిరే కారు(ఫ్లయింగ్ కారు)కు అమెరికా ప్రభుత్వం నుంచి చట్టబద్ధ అనుమతి లభించిందని కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వర్టీకల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్(ఈవీటీఓఎల్) వెహికల్ అని పిలిచే ఈ కారు పూర్తిగా విద్యుత్‌తో పనిచేస్తుంది. ఫ్లయింగ్ కారును తొలిసారిగా 2022 అక్టోబర్‌లో అలెఫ్ కంపెనీ ఆవిష్కరించింది. రోడ్లపైనే పరుగులు తీయడమే కాదు, గాల్లోనూ ప్రయాణించడం ఈ కారు ప్రత్యేకత. హెలికాప్టర్ తరహాలో గాల్లోకి నిలువుగా ఎగరగలదు. నిలువుగా భూమిపై దిగగలదు. మోడల్–ఎ ఫ్లయింగ్ కారు ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే రోడ్డుపై 200 మైళ్లు(322 కిలోమీటర్లు), గాలిలో 110 మైళ్లు(177 కిలోమీటర్లు) ప్రయాణించగలదు. ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించవచ్చు. ఈ కారు ప్రారంభ ధర 3 లక్షల అమెరికన్ డాలర్లు(రూ.2.46 కోట్లు). 150 డాలర్లు (రూ.12,308) చెల్లించి అలెఫ్ వెబ్సైట్ ద్వారా ఫ్లయింగ్ కారును బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రజల నుంచే కాకుండా కంపెనీల నుంచి కూడా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ వెల్లడించింది. మోడల్–ఎ కార్ల ఉత్పత్తిని 2025 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని ప్రకటించింది. తమ ఎగిరే కారుకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) నుంచి స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ సర్టీఫికెట్ లభించిందని అలెఫ్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఇలాంటి వాహనానికి అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి రావడం ఇదే మొదటిసారి అని తెలియజేసింది. మోడల్–ఎ మాత్రమే కాకుండా మోడల్–జెడ్ తయారీపైనా అలెఫ్ సంస్థ దృష్టి పెట్టింది. మోడల్–జెడ్‌ను 2035 నుంచి మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మోడల్ డ్రైవింగ్ రేంజ్, ఫ్లయింగ్ రేంజ్ మరింత అధికంగా ఉంటుంది. ఇందులో ఆరుగురు ప్రయాణించవచ్చు. -
వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
-
కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు
న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ భారత్‌లో వినియోగానికి అత్యవసర అనుమతుల్ని మంజూరు చేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ని కోరింది. ఇప్పటికే యూకే, బహ్రెయిన్‌లో ఫైజర్ అనుమతులు పొందింది. కరోనా టీకా వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న మొదటి సంస్థ ఇదే కావడం విశేషం. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగం కోసం శుక్రవారం ఫైజర్ దరఖాస్తు చేసుకుందని డీసీజీఐ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ టీకా అత్యవసర వినియో గానికి అనుమతులు ఇవ్వాలని సీరం ఇన్స్టి ట్యూట్ కూడా ఆదివారం కేంద్రాన్ని కోరింది. నిబంధనల ప్రకారం ఔషధ వినియోగానికి అనుమతులు కోరితే 90 రోజుల్లో బదులివ్వాల్సి ఉంది. యూకే, బహ్రెయిన్లలో ఫైజర్ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇస్తే డీసీజీఐ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ప్రయోజనం ఎంత ? భారత్‌లో ఈ వ్యాక్సిన్ వినియోగం ఎంతవరకు ఉపయోగం అన్న దానిపై అనుమానాలున్నాయి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరచాలి. సాధారణంగా భారత్‌లో వ్యాక్సిన్లన్నీ రెండు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనే ఉంచుతారు. మన దగ్గర ఈ వ్యాక్సిన్‌ను భద్రపరిచే కోల్డ్ స్టోరేజీలు దొరకడం దుర్లభం. అందుకే భారత్ మొదట్నుంచి ఫైజర్‌తో ఎలాంటి ఒప్పందాలు కానీ వ్యాక్సిన్ ప్రయోగాలు కానీ చేపట్టలేదని అధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ 95% సామర్థ్యంతో పని చేస్తుందని తేలినప్పటికీ ఈ సంస్థల మాతృదేశాలైన అమెరికా, జర్మనీలు ఇంకా అనుమతులివ్వలేదు. జనవరి నుంచి నెలకి 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తామని ఫైజర్ సంస్థ చెప్పింది. దీంతో భారత్ అవసరాలకు సరిపడా డోసులు ఉత్పత్తి, పంపిణీ చేయడం ఫైజర్ ఇప్పట్లో చేయడం కష్టమేనని కరోనాపై జాతీయ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. -
బీజేపీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ తలపెట్టిన ‘రథయాత్ర’కు కోల్‌కతా హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉందనే పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గురువారం ఈ కేసులో వాదోపవాదనలు విన్న జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. బీజేపీ రథయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ విచక్షణాధికారాలను విపరీతమైన ధోరణిలో చలాయించిన సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘సరైన కారణాలు చూపకుండానే అధికారులు యాత్రకు అనుమతిని నిరాకరిస్తున్నారు. సహేతుకమైన షరతులు విధించడం ద్వారానైనా యాత్రను అనుమతించాలా వద్దా అనే ప్రయత్నం కూడా వారు చేయలేదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. రథయాత్ర సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ‘యాత్ర సాగే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలిగించరాదు. ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగినా బాధ్యత వహించాలి. రథయాత్రపై కనీసం 12 గంటలు ముందుగా సంబంధిత జిల్లా పోలీసు సూపరింటెండెంట్లకు సమాచారం అందించాలి’ అని బీజేపీ నాయకత్వాన్ని ఆయన ఆదేశించారు. అయితే, ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. తీర్పును స్వాగతించిన జైట్లీ తీర్పును కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. తమ పార్టీ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. ‘పశ్చిమబెంగాల్లో ఒక రాజకీయ పార్టీ తనకున్న హక్కు ప్రకారం తన కార్యక్రమాన్ని నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుకుంటే మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఒకవేళ ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తే అప్రకటిత ఎమర్జెన్సీ అనే వారు కదా! ఇప్పుడెందుకు మౌనం?’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభం కావాల్సిన బీజేపీ రథయాత్ర ‘సేవ్ డెమోక్రసీ ర్యాలీ’ప్రభుత్వ అనుమతి నిరాకరణ కారణంగా ఆగిపోయింది. కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించి, యాత్ర ప్రారంభిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ ఘోష్ తెలిపారు. -
ప్రాణహాని ఉంది.. తుపాకీ కావాలి : ధోని భార్య
భారత్ క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి లైసెన్స్ రివ్వాలర్ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. అంతేకాక తనకు ప్రాణ హాని ఉందని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఎంఎస్ ధోని మ్యాచ్‌ల దృష్ట్యా బీజీగా ఉంటారనే విషయం విదితమే. ‘ధోని ఇంట్లో చాలా తక్కువ సమయం ఉంటారు. నేను నా కూతురితో కలిసి ఒంటరిగానే ఇంట్లో ఉంటాను. తరచూ ఏదో ఒక పని మీద బయట తిరుగుతుంటాను. ఆ సమయంలో ఒంటరిగానే వెళ్తాను. నా భద్రతా దృష్ట్యా త్వరగా లైసెన్స్డ్ పిస్టల్ లేదా 0.32 రివాల్వర్ ఇప్పించండి’ అని సాక్షి పేర్కొన్నారు. గతంలో కూడా ఎంఎస్ ధోని కూడా లైఎస్స్ తుపాకీ కోసం అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ధోనికి 9ఎమ్ఎమ్ గన్‌కు కూడా అనుమతి ఇచ్చారు. టీమిండియా జట్టు త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. యో యో టెస్టు పాసైన ఎంఎస్ ధోని ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్‌లో ఉన్నాడు. -
పరువు తీసుకుంటున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామిక సభలు, శాంతియుత నిరసనలపై ఇష్టమొచ్చినట్లు ఆంక్షలు విధించడంతో ప్రభుత్వం తన పరువు తానే తీసుకుంటోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ నిర్బంధాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతోందని బుధవారం మీడియాతో పేర్కొన్నారు. ప్రభుత్వాలు జవాబుదారీతనం గా ఉండాలని, రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పాలన జరగాలని హితవు పలికారు. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు ఉన్నాయని, ఏవైనా సమస్యలు ఉత్పన్నమవుతాయని భావిస్తేనే ఆంక్షలు పెట్టొచ్చని చెప్పారు. ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది లేకున్నా తమ సభలకు, నిరసనలకు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. వింత కారణాలు చెబుతున్న పోలీసులు అధికారంలో ఉన్న వారికి ఇది ప్రజాస్వామ్య దేశమని పదేపదే గుర్తుచేయాల్సి వస్తున్నందుకు సిగ్గుగా ఉందని కోదండరాం వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత, అభిప్రాయాలు వెల్లడించే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. జనసమితి సభను హైదరాబాద్‌లో నిర్వహించుకునేందుకు 7 ప్రాంతాలను గుర్తించి, అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. పోలీసు శాఖ చిత్ర, విచిత్రమైన కారణాలను చూపిస్తూ సభకు అనుమతిని నిరాకరిస్తోం దని ఎద్దేవా చేశారు. వాహనాల రద్దీ పెరిగి, ట్రాఫిక్ ఆగిపోయి, వాయు కాలుష్యం పెరిగి, ప్రజలకు ఊపిరితిత్తుల సమస్య వస్తుందంటూ పోలీసుల సమాధానాలకు విస్తుపోయామని చెప్పారు. జన సమితి సభకోసం అడిగిన మైదానంలోనే ఇటీవలే ఓ సినిమాకు సంబంధించి ఫంక్షన్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. పర్యావరణానికి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు మాత్రం ఎలా వస్తుందని దుయ్యబట్టారు. మేమంటేనే సమస్యలు గుర్తొస్తాయా? తెలంగాణ జేఏసీ ఏ కార్యక్రమం నిర్వహించినా, జన సమితి సభలు పెట్టుకున్నా పోలీసులకు ఎన్నో సమస్యలు గుర్తుకొస్తున్నాయని కోదండరాం విమర్శించారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ ఇక్కడే పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్బంధంగా చెప్పడం అప్రజాస్వామికమని, ఇలాంటి అప్రజాస్వామిక ధోరణిని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. జనసమితి అంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందని చెప్పారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు, నిర్బంధాలతో గెలుస్తామని అధికారంలో ఉన్నవారు అనుకుంటే పొరపాటేనని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయని బయటకు చెప్పుకుంటున్నా ఓడిపోతామనే భయం టీఆర్ఎస్కు పట్టుకుందన్నారు. జనసమితి సభ ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలను, ప్రజలకు జరుగుతున్న నష్టాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామనే భయంతోనే అనుమతి ఇవ్వట్లేదని పేర్కొన్నారు. ఎన్నో త్యాగాలు, ఎందరో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారం ఒకే కుటుంబానికే పరిమితం కావడం బాధ కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా అందరినీ సమానంగా చూడాలని, ఆ కుర్చీకి ఉన్న హోదాతో బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. -
ఫ్రీ బేసిక్స్‌ను అనుమతించలేదు
న్యూఢిల్లీ: ‘నేను కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా ఉండగా ఫేస్‌బుక్‌కు చెందిన ఫ్రీ బేసిక్స్ విధానానికి అనుమతి ఇవ్వలేదు’ అని న్యాయశాఖ, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం చెప్పారు. ‘ప్రజలు ఇంటర్నెట్ను వినియోగించుకునేందుకు వారికి ఉన్న హక్కును నిరాకరించలేం. ఫ్రీ బేసిక్స్ కింద కొన్ని వెబ్సైట్లను మాత్రమే ఉచితంగా అందిస్తామని ఫేస్బుక్ చెప్పింది. భారత్ ఇలాంటి విధానాలను ఆమోదించదు’ అని ప్రసాద్ డిజిటల్ ఇండియా సదస్సులో అన్నారు. ఇంటర్నెట్ సమానత్వంపై అమెరికా తన వైఖరిని నిర్ణయించుకోవాలని ఆయన కోరారు. ప్రజలందరికీ ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రకాల ఇంటర్నెట్ సేవలు అందించాల్సిందేననీ, ఇది రాజీలేని అంశమని భారత్ మొదటి రోజు నుంచీ వాదిస్తోందన్నారు. కొన్ని వెబ్సైట్లను ఉచితంగా, మరికొన్ని వెబ్సైట్లను చార్జీలు చెల్లించి బ్రౌజ్ చేసేలా రిలయన్స్‌తో కలసి ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్‌ను, ఎయిర్టెల్ ‘ఎయిర్టెల్ జీరో’ విధానాన్ని గతంలో తీసుకురావడం తెలిసిందే. ఆ తర్వాత ఇలా ఒక్కో వెబ్‌సైట్‌కు ఒక్కో స్పీడ్‌ను, రేటును నిర్ణయించడం వివక్ష కిందకు వస్తుందనీ, ఇలాంటి వాటిని తాము ఉపేక్షించబోమంటూ భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వాటిని నిషేధించింది. నెట్ సమానత్వానికి అనుకూలంగా ట్రాయ్ సిఫార్సులు చేసింది. వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
‘సన్నీ లియోన్’ షోకు అనుమతి ఇవ్వం
బెంగళూరు: బెంగళూరులో డిసెంబర్ 31న జరిగే కొత్త ఏడాది వేడుకల్లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పాల్గొననున్న ఓ కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక రక్షణ వేదికే(కేఆర్వీ)తో పాటు పలు కన్నడ సంఘాలు సన్నీ వేడుకపై ఆందోళనల∙నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. ‘అలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వవద్దని నేను అధికారుల్ని ఆదేశించాను. కన్నడ సంస్కృతి, సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలను ఈవెంట్ నిర్వాహకులు చేపట్టాలి’ అని రాష్ట్ర హోంమంత్రి రామలింగా రెడ్డి వ్యాఖ్యానించారు. -
బ్యాంకుల్లో అశోక చక్ర పసిడి నాణేలు
ఆర్బీఐ అనుమతి ముంబై: అశోకచక్రతో కూడిన భారత పసిడి నాణేలను (ఐజీసీ) విక్రయించడానికి బ్యాంకులకు గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ఎంఎంటీసీ తయారుచేసిన ఈ నాణేలను బ్యాంకులు తమ బ్రాంచీలలో విక్రయించవచ్చని ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ఎంఎంటీసీ సంబంధిత బ్యాంక్ మధ్య కుదిరిన అవగాహన మేరకు విక్రయ విధివిధానాలు ఉండాలని సూచించింది. గోల్డ్ డిపాజిట్ స్కీమ్, గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ కింద సమీకరించిన పసిడితో ఈ నాణేలు తయారుచేయడం జరుగుతుందని ఎంఎంటీసీ ఇప్పటికే వివరణ ఇచ్చింది. 5,10,20 గ్రాముల్లో ఈ నాణేలు లభ్యమవుతాయి. పెన్షనర్ల లావాదేవీలపై సూచనలు... పెన్షనర్ల అకౌంట్ల విషయంలో బ్యాంకులకు ఆర్బీఐ కీలక సూచనలు చేసింది. వారి అకౌంట్లలోకి పెన్షన్లకు సంబంధించిన క్రెడిట్ లావాదేవీలు(ఏరియర్స్ సహా) ఏడాదికి 14 మించరాదని స్పష్టం చేసింది. ఏజెన్సీ బ్యాంక్‌కు ఆ లావాదేవీకి ప్రస్తుతం రూ.65 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. పసిడి పథకం నిబంధనలు సడలింపు .. పసిడి డిపాజిట్ పథకం వైపు ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగా ఆర్బీఐ నిబంధనలు సడలించింది. మధ్య కాలిక (5-7 ఏళ్లు), దీర్ఘకాలిక పసిడి డిపాజిట్లను (12-15 ఏళ్లు) కనీస లాకిన్ పీరియడ్ తర్వాత డిపాజిటర్లు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే, వడ్డీ రేటును కొంత తగ్గించి చెల్లించడం రూపంలో దీనికి పెనాల్టీ ఉంటుంది. మధ్యకాలిక డిపాజిట్లకు మూడేళ్లు, దీర్ఘకాలికమైనవాటికి అయిదేళ్లు లాకిన్ వ్యవధి ఉంది. స్వల్పకాలిక డిపాజిట్లపై అసలు, వడ్డీని బంగారం రూపంలోనే చెల్లించడం జరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. అదే మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్లపై మాత్రం అసలును పసిడి రూపంలోనూ, వడ్డీని రూపాయిల్లోను చెల్లిస్తారు. వడ్డీ లెక్కించడానికి మాత్రం డిపాజిట్ చేసినప్పటి బంగారం విలువను ప్రాతిపదికగా తీసుకుంటారు. మహిళా ఎస్‌హెచ్‌జీలకు 7 శాతానికే రుణం మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) 7 శాతానికే రుణాలు అందించాలని ఆర్బీఐ బ్యాంకులకు స్పష్టంచేసింది 2015-16లో నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) ఆజీవికా స్కీమ్ కింద మహిళా ఎస్‌హెచ్‌జీలకు ఈ తక్కువ స్థాయి రేటుకు రుణం అందించాలని పేర్కొంది. వార్షికంగా 7 శాతం వడ్డీకి రూ.3 లక్షల వరకూ రుణంపై వడ్డీ రాయితీకి(ఇన్‌ట్రస్ట్ సబ్వెన్షన్) ఎస్‌హెచ్‌జీ మహిళలు అందరూ అర్హులేనని వివరించింది.