
సాక్షి, హైదరాబాద్: తన ప్రాణానికి ముప్పు ఉందని తనకు రక్షణ కల్పించాలంటూ సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిందని బయట పెడుతున్నందుకు తనపై కక్షకట్టి తనను హతమార్చాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment