'చంద్రబాబుతో మా కుటుంబానికి ప్రాణహాని'
చిత్తూరు: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుతో మా కుటుంబానికి ప్రాణహాని ఉంది అని పుంగనూరు పీఎస్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి ద్వారకానాథ్ ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని అంతమొందిస్తానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యల్ని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పుంగనూరులో ఆదివారం జరిగిన సభలో పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో తమ కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని.. చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.