చంద్రబాబుతో ప్రాణహాని ఉంది | Manda Krishna fears threat to his life from chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో ప్రాణహాని ఉంది

Published Tue, Jul 11 2017 4:12 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

చంద్రబాబుతో ప్రాణహాని ఉంది

చంద్రబాబుతో ప్రాణహాని ఉంది

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
హన్మకొండ:
ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబుతో తన ప్రాణానికి ముప్పు ఉందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఏపీలో తనకు తిరిగే స్వేచ్ఛను సీఎం చంద్రబాబు హరించి వేశారని అన్నారు. సోమవారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  

ఇవి ఆరోపణలు కావని వాస్తవాలని కృష్ణ స్పష్టం చేశారు. చంద్రబాబు కుటుంబానికి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రక్షణలో ఉండాలి కానీ, తెలంగాణ వారికి ఏపీలో రక్షణ అవసరం లేదా అని ప్రశ్నించారు.  విజయవాడ వెళ్లేందుకు పాస్‌పోర్టు, వీసా తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఈ నెల 8న తాను విజయవాడకు వెళ్లేందుకు సిద్ధం కాగా, ఓ కారు వెంబడించిన విషయాన్న సీఎం కేసీఆర్‌ను కలిసి వివరిస్తానని, సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకకపోతే హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి విచారణ జరపాలని కోరుతానని చెప్పారు.  విచారణ జరిపించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement