నాంపల్లి: సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ విజయ్‌కృష్ణ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ సువర్ణ రజిని అనే మహిళ తన భర్తతో కలిసి బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. సెటిల్‌మెంట్ పేరుతో తన భర్త రాజశేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలకు గురిచేశారని, తీవ్రమైన మానసిక క్షోభకు గురై మంగళవారం రాత్రి ఉరివేసుకునే ప్రయత్నం చేశారని, అదే సమయంలో తాను గమనించి ప్రతిఘటించి ఆత్మహత్యకు పాల్పడకుండా అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.
తన కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ఎస్‌ఐ విజయ్‌కృష్ణ, కానిస్టేబుల్ శ్రీనులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ ఈ కేసును జూన్ 27వ తేదీన విచారణకు ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను విచారణ తేదీ నాటికి అందజేయాలని మలక్‌పేట్ ఏసీపీకి ఆదేశాలు జారీ చేసింది.
'ఆ ఎస్‌ఐ నుంచి మాకు ప్రాణహాని ఉంది'
Published Wed, May 4 2016 9:36 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM
Advertisement
Advertisement