Saidabad police station
-
నెలలో 28 మంది బాలికలు అదృశ్యం.. దీని వెనుక ఏదో ఉంది
సాక్షి, హైదరారబాద్: ఒకే పోలీసుస్టేషన్ పరిధి నుంచి నెల రోజుల కాలంలో 28 మంది బాలికలు అదృశ్యమయ్యారు. దీని వెనుక ఏదో ఉంది... అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టు పోలీసులకు తలనొప్పి తెచ్చి పెట్టింది. ఈ విషయంలో అసలేం జరిగిందంటూ ఆరా తీయగా.. స్లమ్ ఏరియాలు అత్యధికం. హైదరాబాద్ తూర్పు మండల పరిధిలోని మలక్‌పేట డివిజన్లో ఉన్న సైదాబాద్ పోలీసుస్టేషన్ పరిధి మూడు చదరపు కిలోమీటర్లు ఉంది. ఇందులో మూడు లక్షలకు పైగా జనాభా నివసిస్తుండగా... ప్రతి రోజూ 30 వేల నుంచి 40 వేల మంది వచ్చిపోతుంటారు. ఈ ఠాణా పరిధిలోని వచ్చే ప్రాంతాల్లో అత్యధికం స్లమ్ ఏరియాలు ఉన్నాయి. వీటిలో సింగరేణి కాలనీ, కాజాబాగ్, శంకేశ్వరిబజార్, చింతల్‌ల్లోని కీలకం. ఇక్కడ నివసించే వారిలో పేదలు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉన్నారు. ఇదే ఈ ఠాణాకు మిస్సింగ్‌ల సమస్య తెచ్చి పెట్టింది. కొందరు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం, కుటుంబ కలహాల కారణంగానూ ఇల్లు వదులుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుల ఆ«ధారంగా మిస్సింగ్ కేసులు నమోదు చేసుకుంటున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇవీ గణాంకాలు... సైదాబాద్ పోలీస్‌స్టేషన్ జనవరి 1 నుంచి జూన్ 30 వరకు మొత్తం 44 మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఇందులో మైనర్ అమ్మాయిలకు సంబంధించినవి 9 కాగా... 8 కొలిక్కి వచ్చాయి. వీటిలో ఆరు కేసుల్లో మైనర్లను మేజర్లు వివాహం చేసుకున్నట్లు తేలడంతో పోక్సో చట్టం కింద కేసులు మార్చారు. 18–85 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు తప్పిపోయిన కేసులు 23 నమోదయ్యాయి. వీటిలో 19 కొలిక్కిరాగా.. నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మహిళల్లో 80 ఏళ్ళు పైబడిన ఇద్దరు వృద్ధాశ్రమం నుంచి వెళ్లిపోయారు. పది మంది మేజర్లు ప్రేమ వివాహాలు చేసుకుని తిరిగి వచ్చారు. 18 ఏళ్ళు పైబడిన పురుషులు 12 మంది మిస్సింగ్‌పై కేసులు నమోదయ్యాయి. వీటిలో 11 ట్రేస్ కాగా.. ఒకటి పెండింగ్‌లో ఉంది. ఇతను మానసిక రోగి అందుకే ఆచూకీ దొరకడంలేదు. ప్రతి ఫిర్యాదు కేసుగా నమోదు మిస్సింగ్‌కు సంబంధించి వచ్చినన ప్రతి ఫిర్యాదునూ కేసుగా నమోదు చేస్తున్నాం. వారి ఆచూకీ కోసం అధికారిక సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నాం. స్లమ్స్‌లో మిస్సింగ్స్ ఎక్కువగా జరగడానికి కారణాలు విశ్లేషించాం. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి, వారిలో అవగాహనకు కృషి చేస్తున్నాం. – కస్తూరి శ్రీనివాస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సైదాబాద్ -
సంబంధం పెట్టుకోవాలని కానిస్టేబుల్ వేధింపులు
సైదాబాద్: రెడ్డిబస్తీలో నివసించే గిరిజన మహిళ మూడేళ్ల క్రితం పూసలబస్తీలో కుటుంబంతో కలిసి ఉండేది. వారి పక్కింట్లో మాదన్నపేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న పి.వెంకటేశ్వర్లు కుటుంబం నివసించేది. ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితంగా ఉండేవారు. అది అలుసుగా చేసుకొని వెంకటేశ్వర్లు ఆమెతో అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా బాధితురాలిని వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు. ఈ క్రమంలో ఒకరోజు ఆమె భర్త సమక్షంలోనే ఆమెను అసభ్యంగా దూషించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న అతను తిరిగి వేధింపులు మొదలు పెట్టాడు. గతనెల 25న బాధితురాలి ఇంటికి వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు బాధితురాలు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. చదవండి: రాజీకి అని పిలిచి.. స్నేహితులే దారుణంగా -
గాలింపు ముమ్మరం.. జువెనైల్స్ కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ జువెనైల్ హోం నుంచి బాలురు పారిపోయిన కేసులో పురోగతి లభించింది. 15 మందిలో ముగ్గురు బాలురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మూడు బృందాలతో ఈస్ట్ జోన్ పోలీసులు తప్పించుకున్న జువెనైల్స్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మిగతా 12 మంది బాలుర ఆచూకీ త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. సైదాబాద్ జువెనైల్ హోం నుంచి శనివారం అర్ధరాత్రి 15 మంది బాలురు రెండు గ్రూపులుగా విడిపోయి పారిపోయారు. కిటికీ ఇనుప చువ్వలను ఆక్సా బ్లేడ్, కట్టర్ సాయంతో కోసి గోడదూకి బాలురు తప్పించుకున్నారని జువెనైల్ హోం అధికారులు సైదాబాద్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో వీరిపై ఐదేసి కేసులున్నట్లు జువెనైల్ అధికారులు చెబుతున్నారు. కాగా ఇటీవల ఇదే హోం నుంచి ఐదుగురు బాలురు పారిపోగా వెంటనే స్పందించిన పోలీసులు వారిని పట్టుకుని తిరిగి హోంకు తీసుకొచ్చినట్లు సమాచారం. -
జువైనల్ హోం నుంచి 15 మంది పరార్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జువైనల్ హోం నుంచి 15 మంది బాలురు పరారయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జువైనల్ హోం అధికారులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సైదాబాద్‌లోని జువైనల్ హోంలో కిటికీ గ్రిల్స్ తొలగించిన బాలురు.. ఆపై గోడదూకి పక్కనే ఉన్న బస్తీలోకి ప్రవేశించినట్లు సమాచారం. కొందరు హోం నుంచి బయటకు వచ్చి ఓ బైకు మీదు వెళ్లిపోగా, మిగతావారు కాలినడకన వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు హోం నుంచి తప్పించుకున్న బాలురిని గుర్తించినట్లు తెలుస్తోంది. బాలుర కోసం సిటీలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
నా భర్త సంసారానికి పనికిరాడు
-
మా ఆయన అదో టైపు
-
మా ఆయన చాలా ‘తేడా’
సాక్షి, సైదాబాద్: సంసారానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని ఓ వివాహిత శనివారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. సైదాబాద్ డివిజన్ పూసలబస్తీకి చెందిన దీపికకు జహీరాబాద్‌కు చెందిన అంకుష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. అంకుష్ ప్రైవేటు స్కూళ్లు, హాస్టళ్లు నిర్వహిస్తుండగా.. దీపిక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి మానేశారు. అయితే పెళ్లయిన నాటి నుంచి అంకుష్ తనతో సంసార జీవితం గడపలేదని, అతడిలోని లోపం బయటపడకుండా ఉండేందుకు రోజూ వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారని ఆరోపించారు. పెళ్లి సమయంలో రూ.30 లక్షల కట్నం, 50 తులాల బంగారం ఇచ్చామని వెల్లడించారు. తన జీవితాన్ని నాశనం చేసిన అంకుష్‌పై చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'ఆ ఎస్ఐ నుంచి మాకు ప్రాణహాని ఉంది'
నాంపల్లి: సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ విజయ్‌కృష్ణ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ సువర్ణ రజిని అనే మహిళ తన భర్తతో కలిసి బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. సెటిల్మెంట్ పేరుతో తన భర్త రాజశేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలకు గురిచేశారని, తీవ్రమైన మానసిక క్షోభకు గురై మంగళవారం రాత్రి ఉరివేసుకునే ప్రయత్నం చేశారని, అదే సమయంలో తాను గమనించి ప్రతిఘటించి ఆత్మహత్యకు పాల్పడకుండా అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. తన కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ఎస్ఐ విజయ్‌కృష్ణ, కానిస్టేబుల్ శ్రీనులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్సీ ఈ కేసును జూన్ 27వ తేదీన విచారణకు ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను విచారణ తేదీ నాటికి అందజేయాలని మలక్‌పేట్ ఏసీపీకి ఆదేశాలు జారీ చేసింది. -
ఖాజాబాగ్ బస్తీలో ఉద్రిక్తత-పోలీసుల లాఠీచార్జీ
సైదాబాద్ క్రైం: ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకోవడం వివాదానికి దారి తీసింది. ఈ సంఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాబాగ్ బస్తీలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. గుర్తు తెలియని కొంత మంది వ్యక్తులు స్థానిక పద్మావతి కాలేజీ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్నారు. దీంతో బస్తీవాసులు వాటిని తొలగించాలిన డిమాండ్ చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను వారించారు. వారు ఎంతసేపటికి వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్‌కు దిగారు. దీంతో ఒక్క సారిగా ఆ ప్రాంతంలో ఉధ్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జరిపిన లాఠీచార్జీలో పలువురు మహిళలు, గర్భీణిలు, వృద్ధులు ఉన్నారు. దీంతో కోపోదిక్తులైన బస్తీవాసులు సైదాబాద్ పోలీస్ స్టేషన్ ముట్టడించి, దాని ముందు బైఠాయించారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.