జువెనైల్ హోం నుంచి వెళ్లిపోతున్న బాలురు (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ జువెనైల్ హోం నుంచి బాలురు పారిపోయిన కేసులో పురోగతి లభించింది. 15 మందిలో ముగ్గురు బాలురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మూడు బృందాలతో ఈస్ట్ జోన్ పోలీసులు తప్పించుకున్న జువెనైల్స్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మిగతా 12 మంది బాలుర ఆచూకీ త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు.
సైదాబాద్ జువెనైల్ హోం నుంచి శనివారం అర్ధరాత్రి 15 మంది బాలురు రెండు గ్రూపులుగా విడిపోయి పారిపోయారు. కిటికీ ఇనుప చువ్వలను ఆక్సా బ్లేడ్, కట్టర్ సాయంతో కోసి గోడదూకి బాలురు తప్పించుకున్నారని జువెనైల్ హోం అధికారులు సైదాబాద్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో వీరిపై ఐదేసి కేసులున్నట్లు జువెనైల్ అధికారులు చెబుతున్నారు. కాగా ఇటీవల ఇదే హోం నుంచి ఐదుగురు బాలురు పారిపోగా వెంటనే స్పందించిన పోలీసులు వారిని పట్టుకుని తిరిగి హోంకు తీసుకొచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment