Juvenile Home
-
జువెనైల్ హోమ్‌లో అమానుషం.. పిల్లలను చెప్పుతో కొట్టిన అధికారి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జువెనైల్ హోమ్‌లో పిల్లలకు రక్షణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది. బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన ఓ మహిళా అధికారి తన బాధ్యతలు మరిచి వారిపై చేయి చేసుకుంది. చిన్న పిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొట్టింది. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. మహిళా సూపరింటెండెంట్ చిన్నారులను కొడుతున్న దృశ్యాలు జువెనైల్ హోమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ గదిలో ఆరుగురు చిన్నారులు బెడ్స్ మీద పడుకొని ఉన్నారు. అక్కడికి వచ్చిన సూపరిండెండ్ పాల్ ఇతర ఉద్యోగులు చూస్తుండానే ఒక్కసారిగా ఓ చిన్నారిపై దాడి చేసింది. చెప్పుతో పదే పదే చెంపదెబ్బలు కొట్టింది. మిగతా పిల్లలను కూడా తిడుతుండటం వీడియోలో కనిపిస్తుంది. అదే జువెనైల్ హోమ్‌లో నుంచి మంగళవారం మరో వీడియో బయటకు వచ్చింది. ఇందులో మళ్లీ సూపరిండింట్ ఏడేళ్ల వయస్సున్న ఓ అమ్మాయి చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి పడుకోబెట్టింది. విడిపించుకనేందుకు ఆమె ప్రయత్నించినా సాధ్యపడలేదు. మంచం కిందకు జారిపోతుంది. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారి ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జువెనైల్ హోమ్‌లో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సందరు సూపరింటెండెంట్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. In #Agra's govt run children shelterhome (Pachkuiyaan), Poonam Lal, the center superintendent was caught slapping a girl with slippers. Earlier she was booked for abetment to suicide in #Prayagraj district in 2021 after a 15-yr-old girl allegedly killed her self in shelter home pic.twitter.com/JE5V56jR7l — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023 రెండు ఘటనలపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపారు. క్రూరంగా వ్యవహరించిన హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్‌ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అంతేగాక కొన్ని రోజుల క్రితం ఆ హోమ్‌లో ఓ చిన్నారి ఆత్మహత్యకు సైతం ప్రయత్రించింది. కాగా పూనమ్ పాల్ గతంలోప్రయాగ్ రాజ్‌లో పనిచేసింది. అక్కడ కూడా పిల్లలపట్ల ఇంతే క్రూరంగా వ్యవహరించారని అధికారుల విచారణలో తేలింది. The department of woman and child development #UttarPradesh has suspended the accused superintendent Poonam Pal based on the investigation of #Agra DM. pic.twitter.com/jnLIxQtiQq — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023 ఆగ్రా డివిజన్ కమీషనర్ రీతూ మహేశ్వరి మాట్లాడుతూ.. ఈ సంఘటనలతో సంబంధం ఉన్న హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్,ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిందని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించామని పేర్కొన్నారు. -
చెలరేగిన దొంగలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరంలో మంగళవారం రాత్రి ఇద్దరు దొంగలు చెలరేగిపోయారు. రెండు గంటలపాటు స్కూటీపై నగరమంతా తిరుగుతూ కనపడిన వారిపై ఇనుప రాడ్‌తో దాడి చేశారు. ఇద్దరు వాచ్మెన్లను హత్య చేసి, పలువురిని గాయపరిచారు. సుమారు పది షాపుల షట్టర్లు పగులగొట్టారు. కొన్ని షాపుల షట్టర్లు తెరుచుకోలేదు. హంతకుల్ని పోలీసులు 12 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరూ మైనర్లే. పోలీసులు వారిద్దరినీ జువైనల్ హోమ్‌కు తరలిస్తున్నారు. రాత్రి రెండున్నర గంటల సమయంలో గుంటూరు నగరం అమరావతిరోడ్డులోని జ్వరాల ఆసుపత్రి ఎదురుగా మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న యమహా షోరూం వద్దకు స్కూటీపై ఇద్దరు మైనర్లు వచ్చారు. అందులో ఒకడు బండి వద్ద ఉండగా మరొకడు షోరూం వద్ద కుర్చీలో నిద్రపోతున్న కాపలాదారు కృపానిధి (66)పై ఇనుపరాడ్‌తో దాడి చేసి చంపేశాడు. అనంతరం షోరూం షట్టర్లు పగులగొట్టి లోపలికి వెళ్లారు. క్యాష్ కౌంటర్లో నగదు లేకపోవడంతో అక్కడ ఉన్న ఒక హెల్మెట్‌ను తీసుకుని మళ్లీ ద్విచక్ర వాహనంపై నగరంలోకి వచ్చారు. అరండల్‌పేట 11/1 రోడ్డులోని మీసేవ కేంద్రం షట్టర్ తెరిచే ప్రయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంతో పదో రోడ్డులోకి వెళ్లారు. అక్కడ ప్రభుత్వ వైన్‌మార్ట్ వద్ద ఉన్న వాచ్మెన్ బత్తుల సాంబశివరావు (63)పై దాడి చేసి చంపేశారు. అనంతరం వైన్‌మార్ట్ తలుపు తెరిచే ప్రయత్నం చేయగా అది తెరుచుకోలేదు. దీంతో చుట్టుపక్కల నాలుగు షాపుల్లో చోరీకి ప్రయత్నం చేశారు. ఒక సెల్‌ఫోన్ షాపులో రెండు ట్యాబ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు దొంగతనం చేశారు. అలికిడికి పక్కనే ఉన్న స్వగృహా స్వీట్‌షాప్ వాచ్మెన్ బయటకు వచ్చి కేకలు పెట్టడంతో అతనిపై దాడి చేశారు. అతను తప్పించుకుని సమీపంలోని అరండల్‌పేట పోలీసు స్టేషన్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసులకు విషయం చెప్పాడు. డ్యూటీలో ఉన్న సెంట్రీ రక్షక్ వాహనంలో వారిని వెంబడించినా తప్పించుకుపోయారు. అనంతరం అరండల్‌పేట రెండో లైన్లోనే కూర్చుని మద్యం సేవించిన దుండగులు అక్కడి నుంచి పాత గుంటూరు ఆంధ్రా బ్యాంకు వద్ద పేపర్లు కట్టలు కడుతున్న పత్రిక ఏజెంట్‌పై పేపర్ ధర ఎంత అని అడుగుతూనే రాడ్‌తో దాడి చేశారు. ఆయన సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యారు. అనంతరం సుద్దపల్లి డొంక సమీపంలోని పాలబూత్ యజమాని ఎండ్లూరి రవికుమార్ అలియాస్ ఏసుబాబుపై దాడి చేశారు. అతని నడుముకు గాయమైంది. అక్కడి నుంచి యాదవ హైస్కూల్ వద్ద మరో వ్యక్తిపై దాడి చేశారు. అనంతరం నందివెలుగు రోడ్డులోని శ్మశానాల రోడ్డులో రెండు ఆటో ఫైనాన్స్, రెండు స్టిక్కరింగ్, ఒక కూల్‌డ్రింక్ షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. రెండు గంటల్లోనే నగరమంతా తిరుగుతూ విధ్వంసం సృష్టించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలాల్లో ఆనవాళ్లు సేకరించాయి. ఐజీ త్రివిక్రమ వర్మ, జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, ఇతర అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకోవడానికి 8 బృందాలను రంగంలోకి దింపారు. సీసీ టీవీ ఫుటేజిల్లో నిందితుల్లో ఒకడు పాత నేరస్తుడేనని గుర్తించారు. వెంటనే అతని కుటుంబ సభ్యుల నుంచి సెల్‌ఫోన్ నంబర్ తీసుకొని, సిగ్నల్స్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో రెండో నిందితుడిని కూడా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు. గంజాయి మత్తులో వారు ఈ విధంగా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరినీ జువైనల్ హోంకు పంపుతున్నట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. -
బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి
18 ఏళ్ల వయస్సు నిండని నేరం ఆరోపింపబడ్డ ప్రతి బాలుడు, బాలిక 2015 నాటి ‘బాల నేరస్థుల పరిరక్షణ చట్టం’ ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజే బోర్డు) ముందు విచారణ ఎదుర్కోవలసి ఉంటుంది. నేరం చేసిన తేదీ నాటి వయస్సు ప్రామాణికం అవుతుంది. అధికారిక జనన ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేనట్లయితే మెడికల్ బోర్డుచే ధ్రువీకరీంపబడ్డ వయస్సు ఆధారంగా కోర్టు విచారణ పరిధి నిర్ణయమవుతుంది. అరెస్టు చేసిన రోజు నుండి తుది తీర్పు దాకా జేజే బోర్డు విచారిస్తుంది. ఈ బోర్డులో మొదటి శ్రేణి జ్యుడీషియల్ న్యాయాధికారి, రాష్ట్ర ప్రభుత్వం చేత నియమింపబడే ఇరువురు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. ఇరువురిలో ఒకరు మహిళ, మరొకరు చైల్డ్ సైకాలజిస్ట్ ఉంటారు. బెయిలుపై విడుదలయ్యేంత వరకు లేదా తుది తీర్పు దాకా నిందితులను ప్రభుత్వ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలోని అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచుతారు. నేరం రుజువయితే నిందితులకు కారాగార శిక్ష బదులుగా జేజే బోర్డు సభ్యులు మందలించి విడుదల చేయటం లేదా మూడు సంవత్సరాలు మించకుండా సంస్కరణ గృహానికి పంపించటం లేదా విడుదల చేసి కొన్నాళ్ల పాటు మంచి ప్రవర్తనకై జిల్లా ప్రొబేషనరీ అధికారి పర్యవేక్షణలో ఉంచటం లేదా సామాజిక సేవ చేసే ఉత్తర్వులు లేదా జరిమానా చెల్లింపుకు ఆదేశాలివ్వటం జరుగుతుంది. ఇందుకై జిల్లా ప్రొబేషనరీ అధికారి ఇచ్చే సామాజిక దర్యాప్తు నివేదికను పరిగణనలోకి తీసుకుంటారు. ఇరువురు సభ్యుల తీర్పులో ఏకాభిప్రాయం రానట్లయితే జ్యుడీషియల్ అధికారి తీర్పు చలామణి అవుతుంది. నేరం రుజువు కాలేదని జేజే బోర్డు తీర్పిస్తే దానిపై అప్పీలు లేదు. 16 ఏళ్లు పైబడిన నిందితుల కేసుల్లో లేదా అతి హేయమైన నేరం చేసిన కేసుల్లో మాత్రమే అప్పీలు ఉంటుంది. విచారణ ప్రక్రియ మధ్యలో నిందితులు 18 ఏళ్ల వయస్సు దాటినా, జేజే బోర్డు మాత్రమే కేసు కొనసాగిస్తుంది. నేరం రుజువై ప్రభుత్వ సంస్కరణ గృహానికి పంపబడిన వారిని మంచి పౌరులుగా పరివర్తన తేవటానికి వృత్తి విద్య, కౌన్సెలింగ్ లాంటివి చేపడతారు. హత్య, మానభంగం, లైంగిక అత్యాచారం లాంటి అతి హేయమైన నేరం గురించి 16–18 ఏళ్ల వయసున్న నిందితుడు మానసికంగా, భౌతికంగా తను చేస్తున్న నేరం పరిణామాల గురించి అర్థం చేసుకునే పరిపక్వత ఉండీ నేరం చేసినాడని జేజే బోర్డు ప్రాథమిక అంచనాకు వస్తే ఆ కేసును బాలల కోర్టుకు నిందితుడిని పెద్ద వాడిగా భావించి ఇతర కేసుల్లాగే విచారణ జరిపే నిమిత్తం బదిలీ చేసే విచక్షణాధికారం ఉంది. ఇదిలా ఉండగా 16–18 ఏళ్ల వయసున్న నిందితులు చేసిన అతి హేయమైన నేరంపై జేజే బోర్డు ఒక నిర్ణాయిక ప్రాథమిక అంచనాకు రావడానికి మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా ‘బరున్ చంద్ర ఠాకూర్ వర్సెస్ మాస్టర్ భోలు’ అనే కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం 2022 జూలై 13న ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి అనుగుణంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ముసాయిదా మార్గదర్శకాలు తయారు చేసి, తగిన సలహాలు, సూచనలు 2023 జనవరి 20 లోగా ఇవ్వాల్సిందిగా బహిరంగంగా ప్రజలను, నిపుణులను కోరింది. ఒకసారి మార్గదర్శకాలకు తుది రూపు వస్తే, అన్ని జేజే బోర్డులు నిందితులు చేసిన అతి హేయమైన నేరంపై ఏకరూప ప్రాథమిక అంచనా తీర్పు వెలువరించే అవకాశముంది. తద్వారా హత్య, లైంగిక దాడి లాంటి అతి హేయమైన కేసులకు పాల్పడిన16 ఏళ్లు నిండిన నిందితులను బాలల కోర్టులో విచారణ జరిపే అవకాశముంది. అయినా కూడా 18 సంవత్సరాల వయస్సులోపు వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించరాదని చట్టం చెప్తోంది. కొద్ది మాసాల క్రితం జూబ్లీహిల్స్ లోని అమ్నీసియా పబ్ వద్ద ఇన్నోవా వాహనంలో బాలికపై సామూహిక అత్యాచార ఆరోపణ కేసులో 16 ఏళ్లు నిండిన నలుగురు బాలురను మామూలు నిందితుల మాదిరే విచారణ జరపాలని జేజే బోర్డు పోక్సో కోర్టుకు పంపించటం మనందరికీ విదితమే. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ 2021 వార్షిక నివేదిక ప్రకారం మన దేశంలో బాలబాలికల మీద 2019లో 32,269 కేసులు, 2020లో 29,768 కేసులు, 2021లో 31,170 కేసులు నమోదైనాయి. దీన్ని బట్టి బాల బాలికల్లో హింసాత్మక, నేర ప్రవృత్తి స్థాయి మనకు అవగతమవుతుంది. దీనికి తల్లిదండ్రుల నిరాదరణ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొన్ని కారణాలు. వీటిని పరిహరించడం ద్వారానే రేపటి పౌరులను నేర ప్రపంచంలోకి వెళ్లకుండా ఆపగలం. (క్లిక్ చేయండి: మహిళలు రోడ్డెక్కాలంటే భయం.. అదే పెద్ద సమస్య!) - తడకమళ్ళ మురళీధర్ విశ్రాంత జిల్లా జడ్జి -
Amnesia Pub Case: జువైనల్ హోమ్‌కు ఎమ్మెల్యే కుమారుడు
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడితోపాటు మరో మైనర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోమ్‌కు తరలించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుప్పాలగూడ వాసి సాదుద్దీన్‌ను కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇచి్చంది. మిగతా ఐదుగురు మైనర్లనూ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఒకే కేసు.. రెండు కోర్టుల పరిధిలో.. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడిన ముగ్గురు మైనర్లను సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌లో ఉంచారు. తాజాగా ఎమ్మెల్యే కుమారుడు, మరో మైనర్‌నూ కోర్టు ఆదేశాల మేరకు బుధవారం అదే హోమ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ఓ చిత్రమైన అంశం వెలుగులోకి వచి్చంది. సాధారణంగా ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒక డిజిగ్నేటెడ్ కోర్టు ఉంటుంది. గ్యాంగ్ రేప్ జరిగిన జూబ్లీహిల్స్ ఠాణా నాంపల్లిలోని పదిహేడో అదనపు మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు పరిధిలోకి వస్తుంది. ఈ ఠాణాలో నమోదైన కేసుల విచారణ, నిందితుల హాజరు వంటివన్నీ ఆ కోర్టులోనే జరుగుతాయి. అత్యాచారం వంటి తీవ్ర ఆరోపణలకు సంబంధించిన కేసులు మాత్రం నాంపల్లి సెషన్స్ కోర్టు పరిధిలోకి వెళ్తాయి. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పట్టుబడిన వారిని మాత్రం రెండు వేర్వేరు కోర్టుల్లో హాజరుపర్చాల్సి వచి్చంది. ఈ కేసులో పోక్సో యాక్ట్ కూడా ఉండటంతో సాదుద్దీన్‌ను దానికి సంబంధించిన ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. మిగతా వారంతా మైనర్లు కావడంతో వారిని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని జువైనల్ జస్టిస్ కోర్టులో హాజరుపర్చారు. వీరి కస్టడీ పిటిషన్లను సైతం పోలీసులు రెండు న్యాయస్థానాల్లో వేర్వేరుగా దాఖలు చేయాల్సి వచ్చింది. రేపటి నుంచి పోలీసు కస్టడీకి.. సామూహిక అత్యాచారం కేసులో విచారణ నిమిత్తం సాదుద్దీన్‌ను 4 రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ పోక్సో కోర్టు బుధవారం నిర్ణయం తీసుకుంది. పోలీ సులు గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. అతడితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించారు. నిందితుడిని తీసుకుని పబ్, కాన్సూ బేకరీలతోపాటు అత్యాచారం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. నిందితుడు, మిగతా మైనర్లు ఏ సమయంలో, ఎక్కడ, ఏం చేశారనేది తెలుసుకోనున్నారు. నేరం తర్వాత వారు వెళ్లిన ప్రాంతాలు, ఇన్నోవా దాచిన చోటుకూ నిందితుడిని తీసుకువెళతామని అధికారులు తెలిపారు. నేర నిరూపణలో ఇది కీలకాంశమని వెల్లడించారు. ఇక మరో ఐదుగురు మైనర్ నిందితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు. వారిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా జువైనల్ జస్టిస్ కోర్టులో పిటిషన్ వేశారు. పొటెన్సీ టెస్ట్ చేయించి.. గ్యాంగ్ రేప్ కేసులో పట్టుబడిన ఆరుగురిలో ఒకరే మేజర్‌కాగా మిగతా వారంతా మైనర్లు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి ప్రభుత్వ వైద్యుల ద్వారా పొటెన్సీ టెస్ట్ చేయించనున్నారు. ఈ పరీక్ష ద్వారా నిందితులకు లైంగిక పటుత్వం ఉందా? లేదా? అనేది వైద్యపరంగా నిర్ధారిస్తారు. అభియోగపత్రం (చార్జిïÙట్) దాఖలుకు ఇది కీలకం కావడంతో ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. మరోవైపు సాదుద్దీన్ సహా ఆరుగురి గత చరిత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం చేసే సమయంలో ఇన్నోవా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండి ఉంటుందని.. స్వాధీనం చేసుకునేప్పుడు అది లేదని పోలీసులు చెప్తున్నారు. ఓ నిందితుడిని పోలీసులు విచారించిన సమయంలో అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్ లేదని, కేవలం తెరలతో కూడిన షీల్డ్స్ ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. దీంతో కారు అద్దాలపై ఫిల్మ్ ఉండేదా? అనేది నిపుణుల సాయంతో గుర్తించాలని నిర్ణయించారు. ఫిల్మ్ ఉండి, తర్వాత తొలగించినట్టు తేలితే.. ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసిన ఆరోపణలపై ఐపీసీలోని 201 సెక్షన్‌ను జోడించాలని భావిస్తున్నారు. కారుపై రాని క్లారిటీ! బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు.. అధికారిక వాహనమా, లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యక్తిగతంగా వినియోగిస్తున్న వాహనమా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. 2019లో ఖరీదు చేసిన ఆ వాహనం సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన దినాజ్ జహాన్ పేరుతో ఉంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి దాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారు టెంపరరీ రిజి్రస్టేషన్ నంబర్ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. మరోవైపు వాహనం వివరాలు కోరుతూ దినాజ్ జహాన్‌తో పాటు వక్ఫ్ బోర్డుకు నోటీసులు ఇవ్వాలని, లేఖ రాయాలని నిర్ణయించారు. వీటికి సమాధానాలు వస్తే.. అది వక్ఫ్‌బోర్డు లీజుకు తీసుకుని చైర్మన్‌కు కేటాయించిన అధికారిక వాహనమా? లేక చైర్మన్ వ్యక్తిగతంగా తీసుకున్నదా? అనేది స్పష్టం కానుంది. ఇక బెంజ్ కారు మాత్రం కేసులో నిందితుడైన ఓ బాలుడి తల్లి పేరుతో ఉందని, దాన్ని అతడే వినియోగిస్తున్నాడని తేల్చారు. మైనర్‌కు వాహనం ఇవ్వడంతో ఆమెకూ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
పోర్న్ వీడియోలు.. చెల్లెలిపైకి ఉసిగొల్పాయి
సాక్షి, నర్సీపట్నం : పోర్న్ వీడియోల ప్రభావం ఓ బాలుడిని నిందితుడిగా మార్చాయి. అతనికి వరుసకు సోదరి అయిన బాలికపై లైంగికదాడి చేసేందుకు పురిగొల్పాయి, ఆపై హత్యాయత్నం కూడా చేశాడు. దీంతో ఆ బాలిక ప్రమాదకర పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లి(బీకే పల్లి) గ్రామంలో గత ఆదివారం ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి నిందితుడైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని శనివారం విశాఖపట్నం జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. పోర్న్ వీడియోల ప్రభావంతో సోదరిపైనే అత్యాచారానికి తెగబడ్డాడని చెప్పారు. బాధితురాలు, నిందితుడిది ఒకే ఇంటి పేరు. పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. నిందితుడు ఇటీవల పదో తరగతి పాస్ అయ్యాడు, బాధితురాలు ఏడు నుంచి 8వ తరగతిలోకి వస్తోంది. పక్కపక్క ఇళ్లు కావడంతో ఎప్పుడు సరదాగా ఆడుకుంటారు. ఎప్పుడూ మాదిరిగానే 10వ తేదీన ఐదుగురు పిల్లలు ఆడుకున్నారు. వర్షం వస్తుండడంతో ముగ్గురు పిల్లలు ఇంటికి వెళ్లిపోయారు. తమ ఇంటి నిర్మాణానికి తీసుకువచ్చిన సిమెంట్ బస్తాలు వర్షానికి తడవకుండా ఉండేందుకు కవర్ కప్పేందుకు బాధితురాలు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన నిందితుడు పాకలో ప్రవేశించి వెనుక నుంచి ఒక్కసారిగా బాలికను పట్టుకున్నాడు. భయాందోళనకు గురైన ఆ బాలిక పెద్దగా కేకలు పెట్టింది. నలుగురు వస్తే పరువుపోతుందని భావించిన నిందితుడు బాలిక మెడలో ఉన్న చున్నీతో పాక రాటకు గట్టిగా బిగించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలిక స్పృహతప్పడంతో, పాకలో సిమెంట్ బస్తాలు అమ్మాయిపై పడినట్టు సీన్ క్రియేట్ చేశాడు. పరుగు పరుగున ఇంటికి వెళ్లి చెల్లెలు సిమెంట్ బస్తా కిందపడి ఉందని కుటుంబ సభ్యులతో చెప్పాడు. తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టగా నిందితుడు ఆరోజు నుంచి ఊరిలో కనిపించలేదు. అతనిని పట్టుకుని విచారించగా వీడియోల ప్రభావంతో ఎవరైనా అమ్మాయితో అలా ప్రవర్తించాలని అనిపించేదని, కళ్లెదురుగా సోదరి కనిపించడంతో అలా ప్రవర్తించానని పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి, మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించినట్టు సీఐ రేవతమ్మ తెలిపారు. ఈ సమావేశంలో కోటవురట్ల ఎస్ఐ మధుసుధన్‌రావు పాల్గొన్నారు. -
జువైనల్ హోం విద్యార్థుల పరారీ కేసు దర్యాప్తు వేగవంతం
-
గాలింపు ముమ్మరం.. జువెనైల్స్ కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ జువెనైల్ హోం నుంచి బాలురు పారిపోయిన కేసులో పురోగతి లభించింది. 15 మందిలో ముగ్గురు బాలురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మూడు బృందాలతో ఈస్ట్ జోన్ పోలీసులు తప్పించుకున్న జువెనైల్స్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మిగతా 12 మంది బాలుర ఆచూకీ త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. సైదాబాద్ జువెనైల్ హోం నుంచి శనివారం అర్ధరాత్రి 15 మంది బాలురు రెండు గ్రూపులుగా విడిపోయి పారిపోయారు. కిటికీ ఇనుప చువ్వలను ఆక్సా బ్లేడ్, కట్టర్ సాయంతో కోసి గోడదూకి బాలురు తప్పించుకున్నారని జువెనైల్ హోం అధికారులు సైదాబాద్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో వీరిపై ఐదేసి కేసులున్నట్లు జువెనైల్ అధికారులు చెబుతున్నారు. కాగా ఇటీవల ఇదే హోం నుంచి ఐదుగురు బాలురు పారిపోగా వెంటనే స్పందించిన పోలీసులు వారిని పట్టుకుని తిరిగి హోంకు తీసుకొచ్చినట్లు సమాచారం. -
జువెనైల్ హోం నుంచి 15 మంది బాలురు పరారీ
హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్ జువెనైల్ హోం నుంచి శనివారం అర్థరాత్రి 15 మంది బాలురు పారిపోయారు. గదిలోని కిటికీ ఇనుప చువ్వలను ఆక్సా బ్లేడ్, కట్టర్ సాయంతో కోసి కిందకు దిగి గోడ దూకి పారిపోయినట్లు జువెనైల్ అధికారులు చెబుతున్నారు. వీరికి బెయిల్ రావడంలో ఆలస్యం అవుతుండటంతో ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. 13 మంది ఒక గ్రూపుగా ఇద్దరు ఒక గ్రూపుగా విడిపోయి పారిపోతున్న దృశ్యాలు బస్తీలోని సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించాయి. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో వీరిపై ఐదేసి కేసులున్నట్లు జువెనైల్ అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటనపై జువెనైల్ అధికారులు సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పారిపోయిన వారిలో ఒకరిని పట్టుకున్నారు. ఈ మేరకు సైదాబాద్ ఎస్సై కాట్న సత్తయ్య ఆదివారం మీడియాకు తెలిపారు. మూడ్రోజుల క్రితం ఇదే హోం నుంచి ఐదుగురు బాలురు పారిపోగా అధికారులు వారిని వెదికి పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇది జరిగి రెండ్రోజులు గడవకముందే తాజాగా బాలురు తప్పించుకోవటం వెనుక అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. జువెనైల్ హోంను పరిశీలించిన డైరెక్టర్ ఈ ఘటనపై సమాచారం అందుకున్న వీధి బాలల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ ఆదివారం పరిశీలన గృహాన్ని పరిశీలించారు. అక్కడి హోం సూపరింటెండెంట్ నీల కంఠాధర్‌ను వివరాలు అడిగి తెలుసుకుని ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనికి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి పరిశీలనగృహం సూపరింటెండెంట్ నీల కంఠాధర్‌ను సస్పెండ్ చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పిల్లల వద్దకు ఆక్సా బ్లేడ్ వంటి పరికరాలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పిల్లలను సంస్కరించాల్సిన హోం యమపురిగా మారిందని ఆయన మండిపడ్డారు. -
జువైనల్ హోం నుంచి 15 మంది పరార్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జువైనల్ హోం నుంచి 15 మంది బాలురు పరారయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జువైనల్ హోం అధికారులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సైదాబాద్‌లోని జువైనల్ హోంలో కిటికీ గ్రిల్స్ తొలగించిన బాలురు.. ఆపై గోడదూకి పక్కనే ఉన్న బస్తీలోకి ప్రవేశించినట్లు సమాచారం. కొందరు హోం నుంచి బయటకు వచ్చి ఓ బైకు మీదు వెళ్లిపోగా, మిగతావారు కాలినడకన వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు హోం నుంచి తప్పించుకున్న బాలురిని గుర్తించినట్లు తెలుస్తోంది. బాలుర కోసం సిటీలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
జువైనల్ హోం నుండి 15 మంది బాలురు పరార్
-
జువైనల్ హోం నుంచి ఇద్దరు బాలుర పరారీ
లూథియానా: పంజాబ్ రాష్ట్రం లూథియానాలోని గిల్ రోడ్డు ప్రాంతంలో ఉన్న జువైనల్ హోం నుంచి ఇద్దరు బాలురు పారిపోయారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. సంగ్రూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు, లూథియానాకు చెందిన మరో 15 ఏళ్ల బాలుడు హోం నుంచి పరారైనట్లు గుర్తించామని డీజీపీ (ఇన్వెస్టిగేషన్స్) గంగాజిత్ సింగ్ తెలిపారు. హోంలోని రెండో అంతస్తులో ఉన్న వీరు గ్రిల్‌ను, వైర్ మెష్‌ను ధ్వంసం చేశారని, ప్రహరీని అంచనా వేసుకుని గోడ దూకి పరారయ్యారన్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ హోంలో 69మంది బాలలు, నలుగురు పోలీసులు సహా తొమ్మిదిమంది సెక్యూరిటీ గార్డులు విధి నిర్వహణలో ఉన్నారని ఆయన వివరించారు. పరారైన వారిని పట్టుకునేందుకు వెదుకులాట ప్రారంభించినట్లు డీజీపీ తెలిపారు. -
అర్ధరాత్రి బాలనేరస్తుల హల్ చల్
మంగళగిరి: చిన్నతనంలోనే పలు నేరాలు చేసిన యువకులు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకుని మళ్లీ నేరం చేసి పారిపోతూ పోలీసులకు పట్టుబడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జువెనైల్ హోమ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు యువకులు మంగళవారం అర్ధరాత్రి హోం తాళాలు పగులగొట్టి తప్పించుకున్నారు. వారు గుంటూరులో ఒక ద్విచక్రవాహనాన్ని దొంగలించి దానిపై విజయవాడ బయలుదేరారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో వినుకొండ వెళుతున్న సాక్షి దిన పత్రిక ఆటోను చినకాకాని ఎన్ఆర్ఐ ఆస్పత్రి వద్ద నిలిపి డ్రైవర్‌పై దాడి చేసి అతడి వద్ద ఉన్న రూ.వెయ్యి నగదు, సెల్‌ఫోన్ తీసుకున్నారు. ఫోన్లో సిమ్ తీసేసి మళ్లీ గుంటూరు వైపు వెళ్లారు. ఇంతలో ఆటో డ్రైవర్‌కు తెలిసిన వ్యక్తి అటుగా రావడంతో ఇద్దరూ కలిసి వారిని వెంబడించారు. వీరిని పోలీసులుగా భావించిన యువకులు గుంటూరు వెళ్లి ద్విచక్రవాహనాన్ని అక్కడ వదిలేశారు. అక్కడినుంచి ఆటోలో విజయవాడ బయలుదేరారు. హోం నుంచి తప్పించుకున్న విషయాన్ని పోలీసులు సెట్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు తెలపడంతో అప్రమత్తమైన తాడేపల్లి పోలీసులు వారధి వద్ద ఆటోను ఆపారు. అందులోని ఐదుగురు యువకుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో స్టేషన్‌కు తరలించారు. సాక్షి పేపర్ ఆటో డ్రైవర్ తన్నీరు శ్రీనివాస్ మంగళగిరి రూరల్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఆటో డ్రైవర్‌పై దాడి చేసింది తాడేపల్లి పోలీసుల అదుపులో ఉన్న యువకులేనని గుర్తించి వారిని మంగళగిరి స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జువైనల్ హోంలో హత్యపై విచారణ
కడప క్రైం: కడప నగరంలోని జువెనైల్ హోంలో రెండు రోజుల క్రితం జరిగిన హత్యకు సంబంధించి రాష్ట్ర చెరైక్టర్ శారద శనివారం విచారణ ప్రారంభించారు. ప్రత్యేక పరిశీలన గృహంలో ఉంటున్న ముస్తఫా తోటి బాలుడి తో జరిగిన గొడవ నేపథ్యంలో దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి శారద శనివారం ప్రత్యేక వసతి గృహంలో విచారణ చేపట్టారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న బాలురతో పాటు సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలటంతో హెడ్ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం, సూపర్వైజర్ పురుషోత్తంరెడ్డి, బలరామరాజు, వరప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. కాగా, ఈ హోంలో ఏడుగురు ఆశ్రయం పొందుతున్నారు. -
ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంత పనిచేశారు...
పనాజీ: ఓ మైనర్ బాలిక(16)ను ఆమె ఫేస్బుక్ స్నేహితులు కిడ్నాప్ చేశారు. ఈ ఉదంతం గోవాలో చోటుచేసుకుంది. గోవా పోలీసుల కథనం ప్రకారం... ఓ మైనర్ బాలిక పోర్వోరిమ్ ఏరియాలో ఉంటుంది. కాలేజీకి వెళ్తుండగా ఓ తెల్ల కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. అయితే బాలిక కిడ్నాప్ సమాచారం అందుకుని వెంటనే దర్యాప్తు ప్రారంభించి కేవలం మూడు గంటల్లోనే ఆమెను రక్షించామని తెలిపారు. పోర్వోరిమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బివ్బా దాల్వీ నేతృత్వంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. బాధిత బాలికను కిడ్నాప్ చేసిన నిందితులలో ఒకరు మైనర్ బాలుడు ఉండగా అతడ్ని రాష్ట్ర జువెనైల్ హోమ్ కు తరలించామని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. మరో నిందితుడు షబ్బీర్ బాబాసాహెబ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్లు వివరించారు. సోమవారం సాయంత్రం ఆ యువతిని ఇంటి సమీపంలోని ఓ ప్రాంతానికి రమ్మని ఫేస్ బుక్ ఫ్రెండ్స్ పిలిచారు. ఇంట్లో నుంచి వెళ్లిన ఆ బాలిక తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇన్స్పెక్టర్ బివ్బా దాల్వీ టీమ్ వెంటనే రంగంలోకి దిగి బాధిత బాలిక ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత మందిని ప్రశ్నించగా, ఇద్దరితో ఆ ప్రాంతంలో చూసినట్లు చెప్పారు. వెంటనే ఆ యువతి ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఫొటోలు ప్రింట్ తీసి చూపించగా ఇద్దరు యువకులను గుర్తించారు. పోలీసులు టెక్నాలజీ సహాయంతో బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరి ఫోన్ నెంబర్, ఇతర నెట్ వర్క్ లు వినియోగించి వారిని కనిపెట్టారు. బాలికను గోవా మెడికల్ హాస్పిటల్ కు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. బాలికను కార్లో తీసుకెళ్తుండగా తాము నిందితును అదుపులోకి తీసుకున్నామని ఇన్స్పెక్టర్ వివరించారు. -
సెల్‌ఫోన్ చోరీ: జువైనల్ హోమ్‌కు బాలుడు
యాకుత్‌పురా (హైదరాబాద్) : పక్కింట్లో సెల్‌ఫోన్ దొంగిలించిన ఓ బాలుడిని భవానీనగర్ పోలీసులు శుక్రవారం జువైనల్ హోమ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా చాచా గ్యారేజీ ప్రాంతానికి చెందిన బాలుడు (17) పక్కింట్లో ఉండే రుబీనా బేగం ఇంట్లో ఈ నెల 7న రూ.10 వేలు విలువ చేసే సెల్‌ఫోన్‌ను దొంగలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా విషయాన్ని వెల్లడించాడు. దాంతో బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. -
అందుకే ఆ ఇద్దరినీ వేరు చేశారు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషిని ఉగ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న జరిగిన సామూహిక హత్యాచార కాండలో దోషిగా శిక్ష అనుభవిస్తున్న మైనర్‌ను ఉగ్రవాదం వైపు లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ కేసు తీర్పును వ్యతిరేకిస్తున్న మజ్నుకా తిలా జిహాద్ వైపు మళ్లేందుకు ఆలోచిస్తున్నాడని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న ఉంటున్న జువైనల్ హోంలోనే 2011 ఢిల్లీ హైకోర్టు పేలుళ్ల కేసు నిందితుడు కూడా ఉన్నాడు. అందుకే ఇద్దరినీ వేరు చేసినట్టు ప్రకటించాయి. వేర్వేరు గదుల్లో ఉంచిన ఇక ముందు కలుసుకునే అవకాశం లేదని తెలిపాయి. ఈ విషయాన్ని జువైనల్ జస్టిస్ బోర్డు, కేంద్ర హోంశాఖకు కూడా నివేదించినట్టు తెలిపాయి. కాగా నేరాలు జరిగినప్పుడు మైనర్లుగా ఉన్న వీరిద్దరి వయస్సు ఇప్పుడు 20 సంవత్సరాలు. -
జువైనల్ హోం నుంచి బాలుడు పరారీ
సైదాబాద్ (హైదరాబాద్) : సైదాబాద్‌లోని జువైనల్ హోం నుంచి ఓ బాలుడు తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం బూర్లపాడుకు చెందిన ఓ బాలుడి(16)ని స్థానిక పోలీసులు ఓ కేసు విషయంలో అదుపులోకి తీసుకుని సైదాబాద్ జువైనల్ హోంకు అప్పగించారు. కాగా గత నెల 30న పరిశీలన గృహంలో భోజనం చేయడానికి బాలలు ఆవరణలోకి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ బాలుడు గోడ దూకి పరారయ్యాడు. దీనిపై పరిశీలన గృహం సూపరింటెండెంట్ రామచంద్రమూర్తి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర బాలుర సంస్కరణల, సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. -
విడుదల చేయాలంటూ ఆత్మహత్యాయత్నం
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని బాలనేరస్తుల వసతిగృహంలో కొందరు బాలలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమను తొందరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గాజు పెంకులతో చేతులు కోసుకున్నారు. సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు... తిరుపతిలోని మంగళంలో ఆర్టీవో కార్యాలయం వెనుక ప్రభుత్వ బాలనేరస్తుల వసతి గృహం ఉంది. ఇక్కడ చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన బాలనేరస్తులు ఉన్నారు. సోమవారం రాత్రి వసతి గృహానికి న్యాయస్థానం బెంచ్‌క్లర్క్ వచ్చారు. ఈ క్రమంలో శిక్ష అనుభవిస్తున్న బాలనేరస్తులు తమను త్వరగా విడుదల చేయాలని ఆయనను కోరారు. బాలనేరస్తులపై కేసులు ఎక్కువగా ఉన్నందున త్వరగా విచారించి పంపలేమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోవడం లేదని, మరింత విశాలమైన స్థలం కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు గొడవకు దిగారు. అది కాస్తా హింసాత్మక రూపం దాల్చింది. అక్కడ ఉన్న ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, కుర్చీలను విరగ్గొట్టి భోజనాలను కిందికి నెట్టేశారు. తమను తొందరగా విడుదల చేయాలని కొందరు బాలురు గాజుపెంకులతో చేతులు కోసుకున్నారు. పరిశీలన అధికారులు బాలనేరస్తులతో చర్చలు జరపడంతో గొడవ సద్దుమణిగింది. వెంటనే సిబ్బంది 108 సహాయంతో గాయపడిన బాలురను చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. -
జువైనల్ హోమ్‌లో బాలుడి హత్య
ముంబై: బాల నేరస్తులను సంస్కరించాల్సిన నిలయంలోనే వారికి రక్షణ కరువైంది. దొంగతనం కేసులో అనుమానితుడుగా ఉన్న17 ఏళ్ల బాలుడిని తీవ్రంగా కొట్టడంతో పాటు అత్యాచారం చేయడంతో... శరీరంపై తీవ్రగాయాలతో అతడు మరణించిన ఉదంతం కలకలం రేపింది. ముంబై మతుంగ జువైనల్ హోమ్‌లో అమీర్ జమీల్ ఖాన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు. డేవిడ్ సాసూన్ హోమ్ వార్డెన్ సహా, తోటి సహచరులు ఇద్దరు తనను తీవ్రంగా కొట్టారని అమీర్ జమీల్ వాంగ్మూలం ఇచ్చాడని, తనపై అత్యాచారం కూడా జరిగిందని చెప్పాడని శివరాజ్ పార్క్ పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోందని, ముగ్గురు నిందితులపై హత్యకేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే అమీర్ జమీల్ ఖాన్ పారిపోయేందుకు ప్రయత్నించినపుడు తోటి ఖైదీలు పట్టుకొని హింసించినట్టుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని మరింత లోతుగా పరిశీలన చేస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ పాటిల్ వెల్లడించారు. కొడుకు మరణంతో అమీర్ జమీల్ ఖాన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వెదురు కర్రలతో తీవ్రంగా కొట్టి, దారుణంగా తమ బిడ్డను పొట్టన బెట్టుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తనను కొడుతున్నారని, మత్తు మందులు సేవించాలని బలవంతం చేస్తున్నారని అమీర్ ను తాము కలిసినప్పుడు ఏడుస్తూ చెప్పాడన్నారు. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించి తమకు న్యాయం చేయమని రాష్ట్రప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాగా ఏప్రిల్ 17న ఒక మహిళ పర్సును దొంగిలించాడనే ఆరోపణలతో ఈ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం జువైనల్ హోమ్‌కు తరలించినట్టు సమాచారం. -
టీటీఐ వేషంలో ప్రయాణికులకు టోకరా
* ఇద్దరు కేటుగాళ్ల రిమాండ్ * జువైనల్ హోమ్‌కు బాలుడి తరలింపు సికింద్రాబాద్: రైల్వే టీటీఐల వేషంలో బెర్త్‌లు కన్ఫామ్ చేయిస్తామని ప్రయాణికుల నుంచి డబ్బు దండుకోవడంతో పాటు లగేజీ ఎత్తుకెళ్తున్న ఇద్దరు కేటుగాళ్లను గోపాలపురం పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. బీహార్‌కు చెందిన వీరిద్దరికీ సహకరిస్తున్న ఓ బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. డిటెక్టివ్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం....గచ్చిబౌలికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రశాంత్ పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో పాట్నా వెళ్లేందుకు ఈనెల 22న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అయితే అతను కొనుగోలు చేసిన ఆన్లైన్ టికెట్‌పై బెర్త్ కన్ఫామ్ కాకపోవడంతో జనరల్ టికెట్ కొనుగోలు చేసేందుకు కౌంటర్ వద్ద నిలబడ్డాడు. ఇది గమనించిన ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. తనకు తెలిసిన టీటీఐ ఉన్నాడని, టికెట్ కంటే ఎక్కువ డబ్బు చెల్లిస్తే స్పాట్లో బెర్త్ కన్ఫామ్ చేయిస్తాడని నమ్మబలికి రైల్వేరిజర్వేషన్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ టీటీఐ యూనిఫామ్ ధరించి ఉన్న ఓ వ్యక్తిని పరిచయం చేశాడు. టీటీఐ డ్రస్‌లో ఉన్న అతను లగేజీని బయటే పెట్టించి, ప్రశాంత్ ఒక్కడినే రిజర్వేషన్ కార్యాలయంలోకి తీసుకెళ్లి రిజర్వేషన్ ఫామ్ పూరించి, టికెట్ డబ్బు, అదనపు డబ్బు తీసుకున్నాడు. కొద్దిసేపు ఎవరికో ఫోన్ చేస్తున్నట్టు నటించాడు. తర్వాత మేనేజర్‌ను కలిసి వస్తానని చెప్పి లోపలికి వెళ్లిన నకిలీ టీటీఐ వెనుకవైపు ద్వారం గుండా బయటకు ఉడాయించాడు. సమయం గడపిచిపోతున్నా టికెట్ ఇప్పిస్తానన్న వ్యక్తి కనిపించకపోవడంతో ప్రశాంత్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి చూడగా... లగేజీతో పాటు తనను అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి కనిపించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ప్రశాంత్ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీల ద్వారా నిందితులను గుర్తించిన గోపాలపురం పోలీసులు రెండ్రోజులుగా రైల్వేస్టేషన్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించగా ఆ కేటుగాళ్లు కనిపించారు. నిందితుల్లో ఒకడు టీటీఐ యూనిఫామ్ ధరించి ఉన్నాడు. పోలీసులు నిందితుల నుంచి టీటీఐ యూనిఫామ్‌తో పాటు, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సహకరిస్తున్న ఓ బాలుడిని పట్టుకొని జువైనల్ హోమ్‌కు తరలించారు. -
హవ్వా... ఇదేం చోద్యం!
ముజాఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్‌నగర్ లో ఉన్న ప్రభుత్వ బాలచెరసాల(జువనైల్ హోమ్)లో విచిత్రమైన కేసు నమోదయింది. 16 ఏళ్ల బాలుడు తోటి ఖైదీ(18)పై సహజ విరుద్ధమైన లైంగిక చర్య(పుంమైథునం)కు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. బాధితుడిని పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వారందరూ ఇదేం చోద్యమంటూ నోటిపై వేలు వేసుకుంటున్నారు. -
అనాగరిక చర్యపై వివరణ ఇవ్వండి
జువెనైల్ బోర్డు డెరైక్టర్‌కు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ షోకాజ్ నోటీసు హైదరాబాద్/వరంగల్, న్యూస్‌లైన్: వరంగల్‌లోని జువెనైల్ హోంలో జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర జువెనైల్ బోర్డు డెరైక్టర్ భాస్కరచారికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. జువెనైల్ హోంలో ఓ బాలుడు పక్కలో మూత్రం పోస్తున్నాడనే నెపంతో అతడిని హింసించడమే కాక మిగతా పిల్లలతో అతడిపై మూత్ర విసర్జన చేయించి... ఆ బాలుణ్ణి సూపరింటెండెంట్ లారెన్స్ వేధించిన విషయం ఇటీవలే వెలుగు చూసింది. ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జిల్లా న్యాయసేవా సంస్థలు సుమోటాగా విచారణకు స్వీకరించాయి. వరంగల్ జువెనైల్ హోం సూపరింటెండెంట్‌ను తక్షణం విధులకు దూరంగా పెట్టి, బాధ్యులైన ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని, బాధిత బాలుడిని మరో బాలుర గృహానికి తరలించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది. కాగా, ఇదే ఘటనపై వరంగల్ జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి సరళాదేవి బుధవారం హోం నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులను విచారించారు. ఈ ఘటనకు బాధ్యులైన హోం సూపరింటెండెంట్ లారెన్స్‌పై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు అవుట్ సోర్సింగ్ సూపర్ వైజర్ సుధాకర్‌ను విధుల్లో నుంచి తొలగించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.