న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషిని ఉగ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న జరిగిన సామూహిక హత్యాచార కాండలో దోషిగా శిక్ష అనుభవిస్తున్న మైనర్‌ను ఉగ్రవాదం వైపు లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ కేసు తీర్పును వ్యతిరేకిస్తున్న మజ్నుకా తిలా జిహాద్ వైపు మళ్లేందుకు ఆలోచిస్తున్నాడని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న ఉంటున్న జువైనల్ హోంలోనే 2011 ఢిల్లీ హైకోర్టు పేలుళ్ల కేసు నిందితుడు కూడా ఉన్నాడు. అందుకే ఇద్దరినీ వేరు చేసినట్టు ప్రకటించాయి. వేర్వేరు గదుల్లో ఉంచిన ఇక ముందు కలుసుకునే అవకాశం లేదని తెలిపాయి. ఈ విషయాన్ని జువైనల్ జస్టిస్ బోర్డు, కేంద్ర హోంశాఖకు కూడా నివేదించినట్టు తెలిపాయి.
కాగా నేరాలు జరిగినప్పుడు మైనర్లుగా ఉన్న వీరిద్దరి వయస్సు ఇప్పుడు 20 సంవత్సరాలు.
అందుకే ఆ ఇద్దరినీ వేరు చేశారు
Published Thu, Oct 1 2015 3:07 PM | Last Updated on Thu, Oct 4 2018 8:38 PM
Advertisement
Advertisement