లూథియానా: పంజాబ్ రాష్ట్రం లూథియానాలోని గిల్ రోడ్డు ప్రాంతంలో ఉన్న జువైనల్ హోం నుంచి ఇద్దరు బాలురు పారిపోయారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. సంగ్రూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు, లూథియానాకు చెందిన మరో 15 ఏళ్ల బాలుడు హోం నుంచి పరారైనట్లు గుర్తించామని డీజీపీ (ఇన్వెస్టిగేషన్స్) గంగాజిత్ సింగ్ తెలిపారు. హోంలోని రెండో అంతస్తులో ఉన్న వీరు గ్రిల్‌ను, వైర్ మెష్‌ను ధ్వంసం చేశారని, ప్రహరీని అంచనా వేసుకుని గోడ దూకి పరారయ్యారన్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ హోంలో 69మంది బాలలు, నలుగురు పోలీసులు సహా తొమ్మిదిమంది సెక్యూరిటీ గార్డులు విధి నిర్వహణలో ఉన్నారని ఆయన వివరించారు. పరారైన వారిని పట్టుకునేందుకు వెదుకులాట ప్రారంభించినట్లు డీజీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment