luthiana
-
డెలివరీకి వెళ్లే ముందు డ్యాన్స్ వీడియో వైరల్..!
-
ప్రెగ్నెంట్ డ్యాన్స్.. వీడియో వైరల్..!
చండీగఢ్ : డెలివరీ ముందు మహిళలు ఎంత టెన్షన్‌గా ఉంటారో చూస్తూనే ఉంటాము. బిడ్డను కనే తల్లికి.. డెలివరీ చేసే డాక్టర్‌కి ఇద్దరికి టెన్షనే. కానీ ఈ వీడియోలో ఉన్న డాక్టర్, ప్రెగ్నెంట్ మహిళ మాత్రం మిగతావారందరికి భిన్నంగా డెలివరీకి వెళ్లే ముందు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. పంజాబ్ లుథియానాలో జరిగింది ఈ సంఘటన. సిజెరియన్ సర్జరీ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్న మహిళ ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ నటించిన ‘దిల్ ధడక్నే దో’ చిత్రంలోని గర్ల్స్ లైక్ టూ స్వింగ్ పాటకు డ్యాన్స్ వేయడం ప్రారంభించింది. ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చింది. పేషంట్ని డ్యాన్స్ చేయొద్దని చెప్పాల్సిన డాక్టర్ కాస్తా సదరు మహిళతో కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. డాక్టర్, పేషెంట్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. -
జువైనల్ హోం నుంచి ఇద్దరు బాలుర పరారీ
లూథియానా: పంజాబ్ రాష్ట్రం లూథియానాలోని గిల్ రోడ్డు ప్రాంతంలో ఉన్న జువైనల్ హోం నుంచి ఇద్దరు బాలురు పారిపోయారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. సంగ్రూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు, లూథియానాకు చెందిన మరో 15 ఏళ్ల బాలుడు హోం నుంచి పరారైనట్లు గుర్తించామని డీజీపీ (ఇన్వెస్టిగేషన్స్) గంగాజిత్ సింగ్ తెలిపారు. హోంలోని రెండో అంతస్తులో ఉన్న వీరు గ్రిల్‌ను, వైర్ మెష్‌ను ధ్వంసం చేశారని, ప్రహరీని అంచనా వేసుకుని గోడ దూకి పరారయ్యారన్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ హోంలో 69మంది బాలలు, నలుగురు పోలీసులు సహా తొమ్మిదిమంది సెక్యూరిటీ గార్డులు విధి నిర్వహణలో ఉన్నారని ఆయన వివరించారు. పరారైన వారిని పట్టుకునేందుకు వెదుకులాట ప్రారంభించినట్లు డీజీపీ తెలిపారు. -
ఆ షాపులో ఏదైనా రూ.10లకే..
నిరుపేదల అవసరాలకు అనుగుణంగా పంజాబ్‌లోని లూధియానాలో ఓ ఎన్జీవో ఏ వస్తువునైనా రూ.10లకే అందిస్తోంది. దుస్తుల నుంచి బూట్లు, బొమ్మలు, నిత్యవసరాలు, ఇంటి అలంకరణకు కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అయితే ఈ షాపులో దొరికే వస్తువులలో ఎక్కువ మొత్తం సెకండ్ హ్యాండ్‌వి. రోజూ వందల సంఖ్యలో ప్రజలు ఈ షాపులో వస్తువులు కొనడానికి క్యూ కడుతుంటారు. 2014లో ప్రారంభమైన ఈ ఎన్జీవో ఇప్పటివరకు 250 మంది శస్త్రచికిత్సలకు సాయం చేసింది. కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ లక్ష్యమని ఎన్జీవో సభ్యుడు ఒకరు తెలిపారు.