చండీగఢ్ : డెలివరీ ముందు మహిళలు ఎంత టెన్షన్‌గా ఉంటారో చూస్తూనే ఉంటాము. బిడ్డను కనే తల్లికి.. డెలివరీ చేసే డాక్టర్‌కి ఇద్దరికి టెన్షనే. కానీ ఈ వీడియోలో ఉన్న డాక్టర్, ప్రెగ్నెంట్ మహిళ మాత్రం మిగతావారందరికి భిన్నంగా డెలివరీకి వెళ్లే ముందు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. పంజాబ్ లుథియానాలో జరిగింది ఈ సంఘటన. సిజెరియన్ సర్జరీ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్న మహిళ ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ నటించిన ‘దిల్ ధడక్నే దో’ చిత్రంలోని గర్ల్స్ లైక్ టూ స్వింగ్ పాటకు డ్యాన్స్ వేయడం ప్రారంభించింది.
ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చింది. పేషంట్‌ని డ్యాన్స్ చేయొద్దని చెప్పాల్సిన డాక్టర్ కాస్తా సదరు మహిళతో కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. డాక్టర్, పేషెంట్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment