సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జువైనల్ హోం నుంచి 15 మంది బాలురు పరారయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జువైనల్ హోం అధికారులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సైదాబాద్‌లోని జువైనల్ హోంలో కిటికీ గ్రిల్స్ తొలగించిన బాలురు.. ఆపై గోడదూకి పక్కనే ఉన్న బస్తీలోకి ప్రవేశించినట్లు సమాచారం. కొందరు హోం నుంచి బయటకు వచ్చి ఓ బైకు మీదు వెళ్లిపోగా, మిగతావారు కాలినడకన వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు హోం నుంచి తప్పించుకున్న బాలురిని గుర్తించినట్లు తెలుస్తోంది. బాలుర కోసం సిటీలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment