సాక్షి, హైదరాబాద్: ఓ అబ్జర్వేషన్ హోమ్ నుంచి ఆరుగురు బాల నేరస్తులు పరారైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కృషి నగర్‌లో రోజ్ అబ్జర్వేషన్ హోమ్ ఉంది. అందులో ఉన్న బాల నేరస్తులలో ఆరుగురు బాలలు నిర్వాహకులను బెదిరించి పారిపోయారు. కాగా, మూడు నెలల వ్యవధిలో ఇలాంటి సంఘటన జరగడం ఇది మూడోసారి. పోలీస్ స్టేషన్‌లో నిర్వాహకులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి బాల నేరస్తుల కోసం గాలిస్తున్నారు.