యాకుత్‌పురా (హైదరాబాద్) : పక్కింట్లో సెల్‌ఫోన్ దొంగిలించిన ఓ బాలుడిని భవానీనగర్ పోలీసులు శుక్రవారం జువైనల్ హోమ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా చాచా గ్యారేజీ ప్రాంతానికి చెందిన బాలుడు (17) పక్కింట్లో ఉండే రుబీనా బేగం ఇంట్లో ఈ నెల 7న రూ.10 వేలు విలువ చేసే సెల్‌ఫోన్‌ను దొంగలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా విషయాన్ని వెల్లడించాడు. దాంతో బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.