
ప్రతీకాత్మక చిత్రం
సైదాబాద్: రెడ్డిబస్తీలో నివసించే గిరిజన మహిళ మూడేళ్ల క్రితం పూసలబస్తీలో కుటుంబంతో కలిసి ఉండేది. వారి పక్కింట్లో మాదన్నపేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న పి.వెంకటేశ్వర్లు కుటుంబం నివసించేది. ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితంగా ఉండేవారు. అది అలుసుగా చేసుకొని వెంకటేశ్వర్లు ఆమెతో అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా బాధితురాలిని వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు.
ఈ క్రమంలో ఒకరోజు ఆమె భర్త సమక్షంలోనే ఆమెను అసభ్యంగా దూషించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న అతను తిరిగి వేధింపులు మొదలు పెట్టాడు. గతనెల 25న బాధితురాలి ఇంటికి వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు బాధితురాలు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment