సైదాబాద్ క్రైం: ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకోవడం వివాదానికి దారి తీసింది. ఈ సంఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాబాగ్ బస్తీలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. గుర్తు తెలియని కొంత మంది వ్యక్తులు స్థానిక పద్మావతి కాలేజీ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్నారు. దీంతో బస్తీవాసులు వాటిని తొలగించాలిన డిమాండ్ చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను వారించారు. వారు ఎంతసేపటికి వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్‌కు దిగారు. దీంతో ఒక్క సారిగా ఆ ప్రాంతంలో ఉధ్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జరిపిన లాఠీచార్జీలో పలువురు మహిళలు, గర్భీణిలు, వృద్ధులు ఉన్నారు. దీంతో కోపోదిక్తులైన బస్తీవాసులు సైదాబాద్ పోలీస్ స్టేషన్ ముట్టడించి, దాని ముందు బైఠాయించారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఖాజాబాగ్ బస్తీలో ఉద్రిక్తత-పోలీసుల లాఠీచార్జీ
Published Fri, Jan 30 2015 10:00 PM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM
Advertisement