
సీటు అమ్మేశారంటూ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!
కడప: తనకు కావాల్సిన కాలేజీలో మెడికల్ సీటు రాలేదంటూ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి పోలీస్స్టేషన్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. పద్మావతి కాలేజీలో తనకు రావాల్సిన సీటు అమ్ముకున్నారంటూ విద్యార్థిని ఆరోపించింది. కౌన్సెలింగ్లో సీటు వచ్చినా మెడికల్ కాలేజీ అధికారులు ఒప్పుకోలేదని బాధిత విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.
విద్యార్థినికి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే తనకు పద్మావతి కాలేజీలో సీటు దక్కకపోతే మాత్రం ఆత్మహత్య చేసుకుంటానంటూ విద్యార్థిని బెదిరిపంపులకు పాల్పడుతోందని పోలీసులు తెలిపారు. బాధితురాలి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.