మేడ్చల్‌రూరల్: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి మునీరాబాద్ సమీపంలో ఓఆర్‌ఆర్ కల్వర్టు కింద యువతిని దారుణంగా హతమార్చిన ఘటన బయటపడి 24 గంటలు దాటినా ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు పోలీసులకు లభించలేదు. నిందితులు పోలీసులకు క్లూస్ దొరక్కుండా ఉండేందుకు యువతి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
ముందుగానే పథకం రూపొందించుకుని ఓఆర్‌ఆర్ కల్వర్టు కింద..నిర్మానుష్య ప్రదేశం, సీసీ కెమెరాలు లేని ప్రాంతంగా భావించి ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. హత్యకు గురైన యువతి ఒంటిపై ఉన్న నగలు (పూసలదండ, జడ పిన్నీసులు) ఏపీలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తారని సమాచారం. దీంతో పోలీసులు ఏపీలోని మిస్సింగ్ కేసులను సైతం పరిశీలనలోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా హత్య ఘటన పోలీసులకు పెను సవాల్‌గా మారింది.
నిందితుడు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చాకచక్యంగా వ్యవహరించి హత్యకు పాల్పడి పరారయ్యాడు. దీంతో సీసీఎస్ పోలీసులు, ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబద్ కమిషనరేట్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర పోలీస్‌స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ఉదయం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డిలు సంఘటన స్థలిని పరిశీలించారు.
Hyderabad: యువతి దారుణ హత్య.. చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్టు ..
Comments
Please login to add a commentAdd a comment