సంసారానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని ఓ వివాహిత శనివారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. సైదాబాద్ డివిజన్ పూసలబస్తీకి చెందిన దీపికకు జహీరాబాద్‌కు చెందిన అంకుష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. అంకుష్ ప్రైవేటు స్కూళ్లు, హాస్టళ్లు నిర్వహిస్తుండగా.. దీపిక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి మానేశారు.