
సాక్షి, సైదాబాద్: సంసారానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని ఓ వివాహిత శనివారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. సైదాబాద్ డివిజన్ పూసలబస్తీకి చెందిన దీపికకు జహీరాబాద్‌కు చెందిన అంకుష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. అంకుష్ ప్రైవేటు స్కూళ్లు, హాస్టళ్లు నిర్వహిస్తుండగా.. దీపిక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి మానేశారు.
అయితే పెళ్లయిన నాటి నుంచి అంకుష్ తనతో సంసార జీవితం గడపలేదని, అతడిలోని లోపం బయటపడకుండా ఉండేందుకు రోజూ వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారని ఆరోపించారు. పెళ్లి సమయంలో రూ.30 లక్షల కట్నం, 50 తులాల బంగారం ఇచ్చామని వెల్లడించారు. తన జీవితాన్ని నాశనం చేసిన అంకుష్‌పై చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.