
వీరులపాడు (నందిగామ) : తమ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రేమ జంట శుక్రవారం వీరులపాడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన షేక్ నాగుల్‌మీరా, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బంజర గ్రామానికి చెందిన మానువత్ తేజశ్రీ రెండేళ్లుగా ప్రేమించుకొంటున్నారు.
నాగుల్‌మీరా ఇంటర్‌తో చదువు నిలిపివేయగా, తేజశ్రీ మధిరలో టీటీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోందని తెలిపారు. కొన్ని రోజుల క్రితం తమ స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకొన్నారని, అమ్మాయి తల్లిదండ్రులు, వారి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇద్దరు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment